రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించే చిట్కాలు..

First Published Oct 6, 2022, 10:52 AM IST

రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ఆడవారికే ఎక్కువగా వస్తుంది. మధ్యవయస్కులే దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. దీని లక్షణాలను తగ్గించేకోవచ్చు. 
 

రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల జాయింట్ పెయిన్ వస్తుంది. అలాగే కీళ్ల చుట్టూ వాపు కూడా ఉంటుంది. ఈ కీళ్ల నొప్పులకు వారి శరీరంలోని రోగనిరోధక శక్తే కారణం. ఈ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఈ సమస్య వల్ల మోకాలు, పాదాలు, మోచేతులు, చేతులు, చీలమండల, మణికట్టు దెబ్బతింటాయి. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను ఆహారం ద్వారా నయం చేయలేవు. కానీ కొన్ని పోషకాహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య లక్షణాలు తగ్గుతాయి. ఇవి మీ బరువును నియంత్రణలో ఉంచుతాయి. దీంతో కీళ్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి. 

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు

రుమటాయిడ్ కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లలో ఉండే సహజ పదార్థం ఎన్నో మందులతో పోల్చవచ్చు. ఇవి ట్రైగ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ ను, మంటను తగ్గిస్తాయి. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గుండెను  ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తప్పకుండా తినాలి. 

protein rich foods

ప్రోటీన్

చికెన్, సోయా బీన్స్, గుడ్లు, తెల్ల మాంసంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మంచివి. గాయాలైన వారి కండరాలు త్వరగా నయమయ్యేందుకు ఇవి సహాయపడతాయి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బఠానీలు, బీన్స్ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

calcium

కాల్షియం

పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారి ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి శరీరంలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉండాలి. పాలు, పాల ఉత్పత్తులకు బదులుగా జీడిపప్పు, బియ్యం, బాదం పాలను కూడా తీసుకోవచ్చు. వీటిలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 
 

folic acid

ఫోలిక్ ఆమ్లం

ఫోలిక్ యాసిడ్ (విటమిన్ బి9) కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గేందుకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను కూడా తీసుకుంటా ఉండాలి.  శరీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తేనే రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
 

విటమిన్ డి

విటమిన్ డి లోపం కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. అయితే విటమిన్ డి శరీరంలో తగినంత ఉంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. సూర్యరశ్మి, గుడ్డులోని పచ్చసొన, సాల్మన్, జున్ను, గొడ్డు మాసం కాలెయం, చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. 
 

విటమిన్ ఇ

రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు విటమిన్ ఇ చాలా అవసరం. వీరిలో విటమిన్ ఇ లోపిస్తే.. జాయింట్స్ పెయిన్ మరింత ఎక్కువ అవుతుంది. ఆకు కూరలు, గింజలు, సాల్మన్, విత్తనాలు, సీఫుడ్ లో విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.  

click me!