samantha fitness Secret: సమంత ఫిట్ నెస్ సీక్రేట్ తెలిసిపోయింది.. అందుకే ఇలా సన్నజాజిలా ఉంది..

First Published Jan 13, 2022, 1:39 PM IST

samantha fit ness Secret:‘ఊ అంటావా వామా ఉ ఉ అంటావా మావా’ అంటూ గ్లామర్ షో తో ప్రేక్షకులను సమంత ఎంతలా మైమరపించిందో మనకు తెలిసిందే.  ప్రస్తుతం ఎక్కడా చూసినా అందరి నోటా ఈ పాటే వినిపిస్తుంది. మత్తుగా.. గమ్మత్తుగా సాగే పాటలో సమంత చేసిన హాట్ హాట్ ఫోజులు కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి. అందులో సమంత ఎంత నాజుగ్గా.. ఎంత ఫిట్ గా ఉన్నారో మనం చూసిందే. మరి ఈ అమ్మడు అంత సన్నగా ఉండటానికి కారణాలేంటో మీకు తెలుసా.. సామ్ లా సన్నజాజిలా.. నాజూగ్గా ఉండాలంటే మాత్రం మీరు కూడా ఆమెలా చేయాల్సిందే.  

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత ‘samantha’ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అందరిలో The Best అనిపించుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళుతోంది. అందులోనూ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నో సవాళ్లను అధిగమించి, ఒడిదుడుకులను లెక్క చేయకుండా సమన్వయంతో చాకచక్యంగా తన life లో ఘన విజయాలను సొంతం చేసుకుంటోంది ఈ ముద్దు గుమ్మ. తాజాగా పుష్ప (Pushpa) మూవీలో ఐటెం సాంగ్ చేసి ప్రేక్షకులచే వాహ్ వా అని పించింది. అందులో సమంత ఎంత అందంగా, ఫిట్ (Fit) గా కనిపించారో. ఆమెలా మీరు కూడా నాజుగ్గా, బలంగా కావాలనుకుంటున్నారా? అయితే ఈ కుందనపు బొమ్మ చేసే ఎక్సర్ సైజ్లను చేసేయండి.
 


సమంత తన ఆరోగ్యం, ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండదు. అందుకే కదా ఈ అమ్మడు సన్నగా.. అంతకు మించి ఫిట్ గా కనిపిస్తుంటుంది. ఇక ఆమె Fitness కోసం ఎంతలా కష్టపడుతుందో సమంత ఇన్ స్టాగ్రామ్ వీడియోలే చెబుతాయి. మగవాళ్లు సైతం చేయడానికి జంకే Workoutsను samantha ఎంతో సునాయాసంగా చేసేస్తుంది. అందుకే కదా తోటి హీరోయిన్లు సైతం అసూయపడే అందంతో ఒక వెలుగు వెలిగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే samantha పాటించే ఆహార నియమాలు, వ్యాయామాలే ఆమె Fitness కు ప్రధాన కారణాలు. ఆమె అంత Healthy గా ఉండటానికి కూడా ఇవే కారణం. సమంత సినిమాల్లో ఎంత బిజీ బిజీగా ఉన్నా ఆరోగ్యం విషయంలో మాత్రం వెనక్కి తగ్గదు. 

జిమ్ సెంటర్ లో చెమటలు కారేలా వర్కౌట్లు చేసేస్తూ అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తుంటుంది. అమ్మాయిలు వీటిని కూడా చేయగలరా..? అనే విధంగా చేస్తుంది. ఈమె వర్కౌట్లు ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తున్నాయి. సామ్ లా ఫిట్ గా ఉండాలని అందరూ భావిస్తారు. మరి ఆమెలా తయారవ్వాలంటే మాత్రం కష్టించాల్సిందేనండోయ్.  సమంత కార్డియో, యోగా, వెయిట్ ట్రైనింగ్, పుల్ వంటి ఎక్సర్ సైజులు చేస్తుంటుంది. క్రమం తప్పకుండా వీటిని చేయడం వల్లే సమంత ఇంత అందంగా,  ఫిట్ గా ఉన్నారు. కాగా తాజాగా సమంత Fitness Trainer జునైద్ షేక్ తో ఓ వ్యాయామం చేస్తున్న విడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాన్ని చూసిన ఆమె అభిమానులు సమంతను పొగడకుండా ఉండలేకపోతున్నారు. 
 

ఆ వీడియో ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని నెటిజన్లు సమంతను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 2022 సంవత్సరాన్ని మరింత పాజిటీవ్ గా మార్చేందుకే జంపింగ్ స్వ్కాట్ వర్కౌట్స్ ను  నెటిజన్లకు సవాల్ ను విసిరారు. ఇందులో ఎలాంటి పరికరాలు లేకుండా బాడీని లెవెల్ చేయాలని సమంత చెప్పుుకొచ్చింది. కేలరీలను బర్న్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని సమంత తెలిపింది. అందుకే మీరు కూడా కొవ్వును కరిగించే ఈ వర్కౌట్స్ ను చేసేయండని చెప్పుుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం సమంతలా వర్కౌట్స్ చేసేసి సన్నజాజిలా మారిపోండి. 

click me!