ప్రెగ్నెన్సీలో కరోనా పాజిటివ్.. జాగ్రత్తలు ఇవి..

First Published Apr 28, 2021, 2:51 PM IST

కరోనా కల్లోలంతో ఎక్కువగా ఆందోళన చెందుతుంది గర్బిణులే. గర్బవతిగా ఉన్న సమయంలో కోవిడ్ పాజిటివ్‌ వస్తే ఏం చేయాలి అనే దానిమీద అనేక అనుమానాలున్నాయి. అయితే ముందుగా చేయాల్సింది ఒత్తిడికి గురికాకపోవడం, మనోధైర్యంతో ఉండడం. ఆ తరువాత ఏం చేయాలో ఈ విషయాల మీద అవగాహన ఉంటే.. ఒకవేళ గర్భిణీ సమయంలో పాజిటివ్ వచ్చినా పిండానికి హాని కలగకుండా తేలిగ్గా బయటపడవచ్చు. 

కరోనా కల్లోలంతో ఎక్కువగా ఆందోళన చెందుతుంది గర్బిణులే. గర్బవతిగా ఉన్న సమయంలో కోవిడ్ పాజిటివ్‌ వస్తే ఏం చేయాలి అనే దానిమీద అనేక అనుమానాలున్నాయి. అయితే ముందుగా చేయాల్సింది ఒత్తిడికి గురికాకపోవడం, మనోధైర్యంతో ఉండడం. ఆ తరువాత ఏం చేయాలో ఈ విషయాల మీద అవగాహన ఉంటే.. ఒకవేళ గర్భిణీ సమయంలో పాజిటివ్ వచ్చినా పిండానికి హాని కలగకుండా తేలిగ్గా బయటపడవచ్చు.
undefined
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చేసిన తాజా అధ్యయనం ప్రకారం, COVID-19 బారిన పడిన గర్భిణీలు, నవజాత శిశువులు ఇంతకుముందు తెలిసిన దానికంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇది గర్భిణులందరిలోనూ ఒకేలా ఉండడం లేదు.
undefined
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఈ అధ్యయనం ఇప్పటికైతే చిన్నదే. సరైన ఫలితాల కోసం దీనిమీద మరింత పరిశోధన అవసరం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణులు రెండు ప్రాణాలకు బాధ్యత వహిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. అయితే పాజిటివ్ వచ్చినా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు.
undefined
సరైన ఆహారం, విశ్రాంతి, వ్యాయామంతో తేలికపాటి పాజిటివ్ కేసులను ఇంట్లోనే ఈజీగా నయమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గర్భం సమయంలో తల్లి రోగనిరోధక శక్తిలో కొంత మార్పులు రావడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు అంటున్నారు. గర్భిణులు వైరస్ బారిన పడకుండా ఉండటానికి చెకప్ లంటూ ఆసుపత్రికి వెళ్లడం చాలావరకు తగ్గించడం మంచిదని సలహా ఇస్తున్నారు.
undefined
ఫస్ట్ వేవ్ లో గర్బిణులు కరోనా బారిన పడిన సంఖ్య చాలా తక్కువ. కానీ ఇప్పటి సెండ్ వేవ్ లో చాలా మంది గర్భిణీలు వైరస్ బారిన పడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
undefined
ఇక వీరిలోనూ కొమొర్బిడిటీ ఉన్న మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంది. చాలా సందర్భాల్లో, శిశువు చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవాన్ని తగ్గించడం ద్వారా కరోనా వైరస్ గర్భస్థ శిశువు మీద ప్రభావం చూపిస్తోంది.
undefined
గర్భిణీ స్త్రీలలో COVID కేసుల సంఖ్య పెరగడానికి కొత్త స్ట్రెయిన్ కారణమని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో వైరస్ చాలా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు RT-PCR పరీక్షల్లోనూ తేలడం లేదు.
undefined
ఈ పరిస్తితుల్లో గుడ్ న్యూస్ ఏంటంటే.. కోవిడ్ సోకిన గర్భిణులకు డెలివరీలో ఎలాంటి సమస్యలు ఎదురవ్వడంలేదు. కేసు మరీ తీవ్రంగా ఉంటేనే సమస్య వస్తోంది. అంతేకానీ ఆక్సిజన్ స్థాయిలు బాగా ఉండి, కొమొర్బిడిటీ లేనట్లయితే ఎలాంటిప్రమాదం లేదు.
undefined
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్..అని తెలిసిందే అందుకే.. వైరస్ సోకకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైనంత వరకు బయటకు వెళ్లద్దు.
undefined
ఆరోగ్యకరమైన ఆహారం, విశ్రాంతితో పాటు విటమిన్లు, జింక్‌ సప్లిమెంట్స్ తీసుకోవడం మానద్దు. మితమైన వ్యాయామం కూడా ఈ సమయంలో చాలా మంచిది.
undefined
అన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాజిటివ్ వస్తే.. భయపడకండి.. వెంటనే ఆసుపత్రికి వెళ్లండి. లేదంటే చాలా కోవిడ్ కేసులను ఫోన్ లో మీ డాక్టర్ ను సంప్రదించి.. వారి సూచనల మేరకు ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోండి.
undefined
సొంత వైద్యం పనికిరాదు. ఏ మాత్ర వేసుకోవాలన్నా ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించండి. ఐసోలేట్ అవ్వండి. ప్రతి 6 గంటలకు ఓ సారి టెంపరేచర్ చూసుకోండి. ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకోండి.
undefined
వైద్య సహాయం ఎప్పుడు అవసరం?పారాసెటమాల్ తీసుకున్న తర్వాత కూడా మీ ఉష్ణోగ్రత తగ్గకపోతే, ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువగా ఉంటే, మీరు మీ వైద్యుడితో వెంటనే మాట్లాడాలి. దీంతోపాటు తీవ్రమైన ఛాతీ నొప్పి, గోర్లు నీలం రంగులోకి మారుతుంటూ వెంటనే వైద్య సహాయం అవసరం.
undefined
తల్లి నుండి పిల్లలకు.. శిశువు గర్భంలో ఉన్నంతవరకు తల్లినుంచి వైరస్ పిల్లలకు సోకదు. డెలివరీ తరువాత పాలిచ్చే సమయంలో వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఆ సమయంలో మీరు పాటిజివ్ ఉంటే.. పాలిచ్చే ముందు సానిటైజ్ చేసుకోవడం అవసరం. ఇంకా బెస్ట్ ఏంటంటే పాలు వేరుగా సేకరించి పిల్లలకు పట్టడం.
undefined
చివరి మూడు వారాల్లో, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి మరింత జాగ్రతగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
undefined
click me!