ఎంతో రుచికరమైన బ్రెడ్ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

First Published Nov 16, 2021, 3:59 PM IST

బ్రెడ్ (Bread) తో మనం ఎన్నో స్నాక్స్ ట్రై చేసి ఉంటాం. బెడ్ తో ఏ స్నాక్స్ చేసిన చాలా టేస్టీ గా ఉంటుంది. అంతేకాకుండా బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ కట్లెట్ ఇలా ఎన్నో వంటలు చేసి ఉంటాం. ఈసారి వాటిని పక్కన పెట్టేసి కాస్త కొత్తగా ట్రై చేయాలనుకుంటే బ్రెడ్ ఊతప్పంను ట్రై చేస్తే సరి.
 

పిల్లలకు వెరైటీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి వారికి ఎంతో తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో చేసుకునే బ్రెడ్ ఊతప్పం చేసి ఇవ్వండి. వారు దీన్ని తినడానికి ఇష్టపడతారు. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఎంతో రుచికరమైన బ్రెడ్ ఊతప్పం తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

బ్రెడ్ ఊతప్పం తయారీకి కావలసిన పదార్థాలు:
6 బ్రెడ్ స్లైసులు (Bread slices), రెండు టేబుల్ స్పూన్ ల బియ్యప్పిండి (Rice flour), అర కప్పు బొంబాయి రవ్వ (Ravva), తగినంత ఉప్పు (Salt), ఒక టమాట (Tomato), ఒక ఉల్లిపాయ (Onion), కట్ చేసుకున్న కొత్తిమీర (Coriyander), కరివేపాకు రెబ్బలు (Curries), పావు కప్పు పెరుగు (Curd), రెండు పచ్చిమిరపకాయలు (Green chilies), నూనె (Oil).

తయారీ విధానం: ముందుగా బ్రెడ్ స్లైసులను తీసుకొని వాటి అంచుల్ని (Corners) కట్ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసి చేతితో మెత్తగా చేసుకోవాలి. ఇందులో రవ్వ, బియ్యప్పిండి వేసి కలపాలి. తరువాత పెరుగు, ఒకటిన్నర కప్పు నీళ్ళు (Water) పోసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
 

ఇరవై నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఇందులో టమాట, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి బాగా శుభ్రపరుచుకోవాలి. ఇలా శుభ్రపరచుకున్న కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
 

ఇప్పుడు గ్రైండ్ (Grind) చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొని అందులో తరిగిన కూరగాయలు ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం (Pan) పెట్టి వేడి చేయాలి. పెనం వేడి ఎక్కిన తరువాత ఆయిల్ అప్లై చేసి బ్రెడ్ పిండిని మందంగా ఊతప్పంలా వేయాలి. నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకోవాలి.
 

ఇదేవిధంగా మిగిలిన పిండిని అంతా ఉతప్పంలా వేసుకోవాలి. అంతే బ్రెడ్ ఊతప్పం (Bread uthappam) రెడీ (Ready). ఇది తక్కువ టైంలో చేసుకునే బ్రేక్ ఫాస్ట్. ఇది ఒక మంచి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీ పిల్లలకు ఇవ్వండి. వారికి ఈ బ్రేక్ ఫాస్ట్ తప్పకుండా నచ్చుతుంది.

click me!