వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫొటో ఉంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 30, 2024, 10:54 AM IST

ప్రతి ఒక్క వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. అసలు వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫోటోనే ఎందుకు? అసలు వినాయకుడి ఫోటో వెడ్డింగ్ కార్డుపై ఖచ్చితంగా ఉండాలా? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పెళ్లికి వెడ్డింగ్ కార్డు తప్పనిసరి. అందులోనూ వెడ్డింగ్ కార్డుకు హిందూమతంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. వెడ్డింగ్ కార్డును ముందుగా వినాయకుడికి దగ్గర పెడతారు. ఎందుకంటే ఈయనే తొలిపూజలు అందుకంటారు కాబట్టి. అయితే చాలా మంది వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫోటోను పెడుతుంటారు. ఇది ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. అసలు వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫోటో ఉండటం కరెక్టేనా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మొదటి పెళ్లి కార్డు

వెడ్డింగ్ కార్డును దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మాత్రమే పంచుతారు. ముఖ్యంగా వినాయకుడి దగ్గర ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే పెళ్లి ఆహ్వాన పత్రిక విఘ్నేషుడి దగ్గర పెట్టడం వల్ల పెళ్లికి ఆటంకం కలగదని నమ్ముతారు. ఈ కారణంగానే చాలా మంది వెడ్డింగ్ కార్డుపై కూడా వినాయకుడి ఫోటోను పెడతారు.

Latest Videos


వెడ్డింగ్ కార్డుపై ఫోటో

వాస్తు ప్రకారం.. వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫోటోను తయారు చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు. పూర్వకాలంలో వినాయకుడి ఫోటోను పెళ్లి పత్రికలో పెట్టేవారు కూడా. పూర్వకాలంలో గణేష చిత్రాన్ని కార్డును వేరు చేసే చోట పత్రికలో ఉంచేవారు.
 

ఇంట్లో ఫొటోలు పెట్టుకునేవారు

పూర్వ కాలంలో ఇంట్లో వినాయకుడి చిత్ర పటాన్ని ప్రత్యేకంగా ఉంచి పూజించేవారు. అంటే అప్పట్లో కార్డులపై వినాయకుడి చిత్రాన్ని పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు గణేశుడి ఫొటో కార్డుపై పక్కాగా పెట్టిస్తున్నారు. 
 

ganesha 001

కార్డులను పారేయడం 

ప్రస్తుత కాలంలో పెళ్లి అయిపోగానే చాలా మంది కార్డులను పారేస్తుంటారు. లేదా ఏదో ఒక చెట్టు కింద పెట్టేసి వస్తుంటారు. కానీ ఇలా చేయడం మీకు అస్సలు మంచిది కాదని పండితులు అంటున్నారు. ఎందుకంటే వెడ్డింగ్ కార్డుపై వినాయకుడి ఫోటో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు వెడ్డింగ్ కార్డును పారేసినా లేదా చెట్టు కింద ఉంచినా వినాయకుడిని అవమానించినట్టే అవుతుంది. అందుకే వినాయకుడి ఫొటోను వెడ్డింగ్ కార్డుపై పెట్టకూడదు. బదులుగా వెడ్డింగ్ కార్డుపై శుభానికి చిహ్నంగా నెమలి ఈకల చిత్రాన్ని పెట్టించొచ్చు. 
 

click me!