లిప్‌ లాక్‌లకు అడ్డుపడ్డ పేరెంట్స్.. మృణాల్‌ ఠాకూర్‌ అవకాశాలన్నీ మిస్సింగ్‌.. `సీతారామం` బ్యూటీ ఏం చేసిందంటే?

Published : Apr 30, 2024, 10:45 AM ISTUpdated : Apr 30, 2024, 04:16 PM IST

మృణాల్‌ ఠాకూర్‌.. తమ పేరెంట్స్ విషయంలో ఆవేదన వ్యక్తం చేసింది. పేరెంట్స్ పెట్టిన కండీషన్స్ వల్లే తాను చాలా ఆఫర్లు కోల్పోయానని చెబుతూ షాకిచ్చింది.    

PREV
16
లిప్‌ లాక్‌లకు అడ్డుపడ్డ పేరెంట్స్.. మృణాల్‌ ఠాకూర్‌ అవకాశాలన్నీ మిస్సింగ్‌.. `సీతారామం` బ్యూటీ ఏం చేసిందంటే?

మృణాల్‌ ఠాకూర్‌ వరుస పరాజయాలకు `ఫ్యామిలీ స్టార్‌` బ్రేక్‌ వేసింది. కానీ ఈ అమ్మడి క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే అదే జోరు కొనసాగిస్తుంది. అయితే కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందీ బ్యూటీ. కొన్ని కండీషన్స్ కూడా చాలా ఆఫర్లు దూరమవ్వడానికి కారణమవుతుందని చెప్పొచ్చు. 

26

మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌ అయ్యింది. `సీతారామం` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత చాలా ఆఫర్లు ఆమెని వరించాయి. కానీ ఆమె చేయలేదు. చాలా సెలక్టీవ్‌గా వెళ్లింది. దానికి పెద్ద కారణమే ఉందట. దానికి కారణం తమ పేరెంట్సే అని చెప్పింది. వాళ్ల కండీషన్ల కారణంగానే ఆమె అన్ని సినిమాలు చేయలేకపోతున్నట్టు తెలిపింది మృణాల్‌. 
 

36

కెరీర్‌ ప్రారంభంలో మృణాల్‌కి చాలా ఆఫర్లు వచ్చాయట. అయితే అందులో ముద్దు సీన్లున్నాయని, అవి తమ పేరెంట్స్ కి ఇష్టం లేదని తెలిపింది. ముద్దు సీన్ల కారణంగానే తాను చాలా ఆఫర్లని కోల్పోయినట్టు తెలిపింది మృణాల్‌. తమ పేరెంట్స్ అలాంటి ఇంటిమేట్‌(రొమాంటిక్‌) సీన్లని ఎంకరేజ్‌ చేసేవారు కాదని, ఆ విషయంలో వాళ్లు కండీషన్స్ పెట్టేవారని తెలిపింది. 
 

46

అలా లిప్‌ లాక్‌ సీన్లు ఉండటం వల్ల మంచి ఆఫర్లని కూడా మిస్‌ చేసుకున్నట్టు తెలిపింది. దీంతో చాలా అవకాశాలు తనకు రాకుండా పోయాయని చెప్పింది. అయితే లేట్‌గా అయినా ఈ విషయంలో తాను రియలైజ్‌ అయ్యానని, కంటెంట్‌ ఉంటే, ముద్దు సీన్‌కి బలమైన కారణం ఉంటే తాను చేయోచ్చని తాను నిర్ణయించుకున్నానని, ఆ విషయంలో పేరెంట్స్ ని కూడా కన్విన్స్ చేస్తున్నానని తెలిపింది మృణాల్‌. 
 

56

మృణాల్‌ ఠాకూర్‌.. నానితో `హాయ్‌ నాన్న`, విజయ్‌ దేవరకొండతో `ఫ్యామిలీ స్టార్‌` చిత్రాల్లో ముద్దు సీన్లు చేసింది. లిప్‌ లాక్‌లతో రెచ్చిపోయింది. అయితే వీటిలో `హాయ్‌ నాన్న` బాగానే ఆడింది. కానీ ఫ్యామిలీ స్టార్‌ నిరాశ పరిచింది. యూత్‌ అంశాలు లేకపోవడంతో యువత ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపించలేదు. పైగా స్లో నెరేషన్‌ కూడా దెబ్బతీసింది. పూర్తి ఫ్యామిలీ స్టోరీగా దీన్ని రూపొందించారు. అయితే ఓటీటీలో ఈ మూవీకి మంచి స్పందన లభిస్తుండటం విశేషం. 
 

66

మృణాల్‌ ఠాకూర్‌ `సీతారామం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ఆ తర్వాత `హాయ్‌ నాన్న`, `ఫ్యామిలీ స్టార్‌` చిత్రాల్లో మెరిసింది. అంతకు ముందు హిందీలో మూడు నాలుగు సినిమాలు చేసింది. అందులో `జెర్సీ` రీమేక్‌ కూడా ఉంది. అందులోనూ లిప్‌లాక్‌లు పెట్టింది మృణాల్‌. కానీ ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. ప్రస్తుతం హిందీలో ఓ మూవీ చేస్తుంది మృణాల్‌. తెలుగులో చర్చల దశలో ఉన్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories