ఇవి తింటే ఎక్కువ రోజులు బతుకుతారు

First Published Jan 16, 2023, 11:54 AM IST

నిండు నూరేళ్లు బతకాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ అందుకు ప్రయత్నాలు మాత్రం చేయరు. నిజానికి ఎక్కువ రోజులు బతకాలంలో మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. జస్ట్ ఆరోగ్యాన్ని పాడుచేసే వాటికి దూరంగా ఉంటూ.. రోజూ శారీరక శ్రమ చేస్తూ.. ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తింటే చాలు.. 
 

మనం తింటున్న ఆహారం మనకు మేలు చేసేదా? లేక హాని కలిగించేదా? అన్న విషయాన్ని ముందే తెలుసుకోవడం మంచిది. కానీ ఈ రోజుల్లో చాలా మంది ప్రెసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లకే బాగా అలవాటు పడ్డారు. ఇండ్లో వండిన వంటలను తినడమే మానేసారు. ఎందుకంటే బయటిఫుడ్ కాస్త టేస్ట్ గా ఉంటుందని. నిజానికి ఇది టేస్ట్ మాత్రమే ఉంటుంది. పోషకాలు అసలే ఉండవు. దీనికి తోడు వీటిని తినడం వల్ల గుండె జబ్బుల నుంచి మధుమేహం, క్యాన్సర్, ఊబకాయం వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలను కలిగిస్తాయి. మనలో ఎవరూ కూడా ఈ భూమిపై శాశ్వతంగా జీవించలేరు. కొన్ని రోజులు ఎక్కువ కాలం బతికే అవకాశం మాత్రమం ఉంది. మన తినే ఆహారం మన జీవిత కాలాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. కొన్ని ఆహారాలను తింటే మీ జీవితానికి ఇకొన్ని అదనపు సంవత్సరాలను కలపొచ్చు. మన ఆయుష్షును పెంచడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

nuts

గింజలు

గింజలు పోషకాహారాలకు శక్తి కేంద్రాలు. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వు, మొక్కల ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం ఎన్నో ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి మన జీవిత కాలాన్ని పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే రోజూ గుప్పెడు గింజలను తినండి. 
 

ముదురు రంగు పండ్లు, కూరగాయలు

పండ్లను, కూరగాయలు ఎక్కువ తినేవారు.. వాటిలో ఉన్న పోషకాలను పొంది వీటిని తినని వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని ఎన్నో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పండ్లు, కూరగాయల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కూరగాయల్లో ముఖ్యంగా.. ముదురు రంగు కూరగాయలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటికి రంగును ఇచ్చే సహజ వర్ణద్రవ్యం క్యాన్సర్ ను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

Leafy Vegetables

ఆకుకూరలు

బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్ వంటి ఆకుకూరలు ఫోలేట్ కు మంచి వనరులు. ఇది కణాల పెరుగుదలకు, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి చాలా ముఖ్యమైనవి. వీటిలో ఉండే కెరోటిన్లు కంటిచూపును మెరుగుపరుస్తాయి. ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతాయి. చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. 
 

కొవ్వు చేపలు

సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, ట్రౌట్ వంటి కొవ్వు చేపల్లో ఉండే పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ డి లు కూడా ఉంటాయి. ఈ చేపలు మన రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయి. ఈ చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను, మెదడు దెబ్బతినడం, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి కూడా.
 

క్రాన్బెర్రీస్

క్రాన్బెర్రీలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వివరంగా చెప్పాలంటే ఈ చిన్న పండు మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఈ పండు మన జీవిత కాలాన్ని కూడా పెంచుతుంది. ఈ చిన్న పండులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఈ పండులో ఫైటోన్యూట్రియెంట్లు కూడా ఉంటాయి. మన శరీరంలో ఫైటోన్యూట్రియెంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే.. రక్షణ అంత ఎక్కువగా ఉంటుంది.
 

click me!