ఈ అలవాట్లు మార్చుకుంటే.. వృద్ధాప్యం మీ జోలికి రాదు..

First Published Jul 7, 2021, 3:41 PM IST

రోజురోజుకూ వయసు పెరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే వృద్ధాప్యం మీద పడుతుంది. ఇది అనివార్యమైన ప్రక్రియ అయితే.. అకాల వృద్ధాప్యం గురించి ఆందోళన చెందాల్సిందే.

రోజురోజుకూ వయసు పెరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే వృద్ధాప్యం మీద పడుతుంది. ఇది అనివార్యమైన ప్రక్రియ అయితే.. అకాల వృద్ధాప్యం గురించి ఆందోళన చెందాల్సిందే.
undefined
ఎందుకంటే కొంతమంది ఎంత వయసు వచ్చినా యంగ్ గా కనిపిస్తే.. మరికొంతమంది 30, 40ల్లోకి వచ్చేసరికే వృద్ధాప్య లక్షణాలతో చాలా పెద్ద వారిలా కనిపిస్తుంటారు.
undefined
దీనికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలినే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ ఆహారపు అలవాట్లు, జీవన శైలిలోని కొన్ని అలవాట్లు దీనికి దారితీస్తాయని చెబుతున్నారు. అవేంటంటే...
undefined
దీనికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలినే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ ఆహారపు అలవాట్లు, జీవన శైలిలోని కొన్ని అలవాట్లు దీనికి దారితీస్తాయని చెబుతున్నారు. అవేంటంటే...
undefined
అతిగా మద్యం సేవించడం.. దీనివల్ల ప్రతిక్రియ వెంటనే మొదలవుతుంది. ముందుగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. శరీరంలో మంటలకు దారితీస్తుంది. దీనివల్ల మొహంమీద వేడి ఆవిర్లు వచ్చిన భావన కలుగుతుంది. కేశనాళికల్లో తేడా వస్తుంది. దీంతో వయసు మీదపడిన వారిగా కనిపిస్తారు.
undefined
మద్యం ఎక్కువగా తాగే వారిలో ముఖం మీద మడతలు, కళ్లకింద క్యారీబ్యాగులు వస్తాయని అధ్యయనాల్లో తేలింది.
undefined
కరోనా ఎప్పుడైతే దాడి మొదలుపెట్టిందో.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో టీవీలు, లాప్ టాప్ లు, ఫోన్లలో గడిపే సమయం ఎక్కువైపోయింది. వీటినుంచి వచ్చే నీలికాంతి...తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపించేలా చేస్తాయి.
undefined
అందుకే ఊరికే టీవీ, ఫోన్లు చూస్తూ కూర్చోకుండా, సోషల్ మీడియాలో ఉండకుండా ఉంటే మంచిది.
undefined
తగినంత నీరు తాగక పోవడం.. మానవ శరీరంలో 60% నీరే ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలికి చాలా ముఖ్యం. అయితే శరీరానికి బైటినుంచి కూడా నీరు చాలా అవసరం.. తగినంత నీరు తాగకపోవడం అలసట, తరచూ అనారోగ్యం, మలబద్ధకం, చర్మ ఆరోగ్యం వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది.
undefined
డీహైడ్రేషన్ వల్ల ముఖం మీద ముడతలు, కళ్లకింద నల్లటి వలయాలు, మచ్చలు, మరకలు ఏర్పడతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా, ఉత్సాహంగా, మరింత యవ్వనంగా కనిపిస్తుంది.
undefined
పొగతాగడం... పొగాకులో అనేక విషపదార్థాలుంటాయి. ఇవి ఆక్సిజన్ ప్రసరణ, అనేక ముఖ్యమైన పోషకాలను చర్మానికి అందకుండా చేస్తాయి, తగ్గిస్తాయి. ధూమపానం వల్ల చర్మం కొత్త కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది.
undefined
చక్కెర ఎక్కువగా తినడం..కొల్లాజెన్, ఎలాస్టిన్ చర్మంలోని రెండు ప్రధాన సమ్మేళనాలు, ఇవి చర్మాన్ని బిగుతుగా, నునుపుగా, యవ్వనంగా ఉంచుతాయి. అధ్యయనాల ప్రకారం, అధిక స్థాయిలో చక్కెర లేదా గ్లూకోజ్ తినేటప్పుడు, అవి కొల్లాజెన్, ఎలాస్టిన్లలోని అమైనో ఆమ్లాలను కలుపుతాయి, తద్వారా అవి దెబ్బతింటాయి. దీంతో శరీర సహజ మరమ్మత్తు ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి.
undefined
ఒత్తిడి..నిద్ర లేకపోవడం : అత్యంత ప్రమాదకరమైనవి ఈ రెండూ. నేటి పరిస్థితుల్లో ఒత్తిడి మామూలు విషయం అయిపోయింది. అయితే సరైన నిద్ర దీనివల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. శరీర వ్యవస్థను పునరుద్ధరించి, మరమ్మత్తు చేస్తుంది.
undefined
అయితే ఒత్తిడితో పాటు నిద్రలేమీ చేరడంతో మీ శరీరం కోలుకోలేదు. మీరు ఒత్తిడికి గురైనప్పుడు, నాడీ వ్యవస్థ కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ ఒత్తిడి హార్మోన్ మన చర్మంలో చమురు ఉత్పత్తి పెరగడానికి దారితీస్తుంది, ఫలితంగా రంధ్రాలు, మొటిమలు విరిగిపోతాయి.
undefined
click me!