తాను చదివిన స్కూల్ నుంచి సర్ప్రైజ్..కన్నీళ్లు వస్తున్నాయి అంటూ హనుమాన్ డైరెక్టర్ పోస్ట్, వీడియో

By tirumala ANFirst Published Apr 30, 2024, 7:20 PM IST
Highlights

హను మాన్ తీపి జ్ఞాపకాలు ఈ దర్శకుడిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. హను మాన్ చిత్రంతో ప్రశాంత్ వర్మ ఇండియాలో కూడా సూపర్ హీరోల చిత్రాలకు మంచి ఆదరణ ఉందని మరోసారి రుజువు చేశాడు.

పాన్ ఇండియా వైడ్ గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగుతోంది. ఆంజనేయ స్వామి బ్యాక్ డ్రాప్ లో సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిన హనుమాన్ పాన్ ఇండియా వైడ్ సంచలనాలు సృష్టించింది. ఇండియా మొత్తం ఈ చిత్రం 300 కోట్లకి పైగా వసూళ్లు సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.  ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రం బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో ఉండబోతున్న సంగతి తెలిసిందే. 

అయితే హను మాన్ తీపి జ్ఞాపకాలు ఈ దర్శకుడిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. హను మాన్ చిత్రంతో ప్రశాంత్ వర్మ ఇండియాలో కూడా సూపర్ హీరోల చిత్రాలకు మంచి ఆదరణ ఉందని మరోసారి రుజువు చేశాడు. ఇంతటి ఘనత సాధించిన ప్రశాంత్ వర్మని ప్రముఖులందరి నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 

ప్రశాంత్ వర్మ తానూ చిన్నతనంలో పాలకొల్లు లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ అనే స్కూల్ లో విద్యనభ్యసించారు. హను మాన్ రిలీజ్ టైంలో ఆ స్కూల్ నుంచి ప్రశాంత్ వర్మకి ఎమోషనల్ గిఫ్ట్ అందింది. విద్యార్థులంతా స్కూల్ ప్రాంగణంలో హను మాన్ ఆకారంలో నిలబడి ఆ వీడియో ప్రశాంత్ వర్మకి పంపారు. 

 

ఈ వీడియోని ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఇది చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని పోస్ట్ చేశాడు. తాను చదివిన స్కూల్ లో విద్యతో పాటు మన ధర్మం, సంస్కృతి గురించి అనేక విషయాలు నేర్పారని ప్రశాంత్ వర్మ గతంలో తెలిపాడు. 

click me!