T20 WC India Squad : స్టార్ ప్లేయర్లకు షాకిచ్చిన బీసీసీఐ.. టాప్-5 అన్‌లక్కీ ప్లేయ‌ర్లు వీరే..

First Published | Apr 30, 2024, 7:19 PM IST

India T20 World Cup 2024 squad : బీసీసీఐ రాబోయే టీ20 ప్రపంచ కప్ 2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. భారత్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండ‌గా, విరాట్ కోహ్లీ కూడా జ‌ట్టులో ఉన్నాడు. అయితే, ప‌లువురు స్టార్ ప్లేయ‌ర్ల‌కు బీసీసీఐ షాకిచ్చింది. 
 

KL Rahul, Shreyas Iyer, Shubman Gill, Rinku Singh

T20 WC India Squad : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్ర‌క‌టించింది. ఇందులో రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, సంజూ శాంస‌న్ లు ఉన్నారు. అయితే, ప‌లువురు స్టార్ ప్లేయ‌ర్ల‌కు అర్హ‌త ఉన్నా వారికి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌బోయే భార‌త జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. ఈ లిస్టులో ఉన్న టాప్-5 అన్ ల‌క్కీ ప్లేయ‌ర్ల‌ను గ‌మనిస్తే.. 
 

KL Rahul

కేఎల్ రాహుల్

భారత జ‌ట్టులోని స్టార్ ప్లేయ‌ర్. ఒంటిచేత్తో భార‌త్ కు అనేక విజ‌యాలు అందించాడు. అనుభవజ్ఞుడైన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా ఉన్న‌ కేఎల్ రాహుల్‌కు ప్రపంచకప్ భార‌త‌ జట్టులో చోటు దక్కలేదు. రిజర్వు ఆటగాళ్ల లిస్టులో కూడా లేడు. భార‌త జ‌ట్టులో కేఎల్ రాహుల్ పేరు లేక‌పోవ‌డంపై అభిమానులు కాస్త ఆశ్చర్యానికి గురవుతూనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేఎల్ రాహుల్ భారత్ తరఫున 72 టీ20 మ్యాచ్‌ల్లో 139 స్ట్రైక్ రేట్‌తో 2265 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 127 మ్యాచ్‌లు ఆడి 4541 పరుగులు సాధించాడు.

Latest Videos


BCCI , Ishan Kishan

ఇషాన్ కిషన్

యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డిసెంబర్ 2023 వరకు భారత జట్టులో ఉన్నాడు. సౌతాఫ్రికా సిరీస్ మ‌ధ్య‌లో విరామం తీసుకుని స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత అత‌నికి జ‌ట్టులో చోటు ద‌క్క‌డం క‌ష్టంగా మారింది. ఇప్పుడు భార‌త జ‌ట్టులోకి తిరిగి రాలేకపోతున్నాడు. భారత్ తరఫున ఇషాన్ కిష‌న్ 32 టీ20ల్లో 796 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన అతను 136 స్ట్రైక్ రేట్‌తో 2536 పరుగులు కొట్టాడు.

Shreyas Iyer

శ్రేయాస్ అయ్యర్

అనుభవజ్ఞుడైన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కు కూడా టీ20 ప్రపంచకప్ భార‌త‌ జట్టులో చోటు దక్కలేదు. టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ 47 టీ20 మ్యాచ్‌ల్లో 136 స్ట్రైక్ రేట్‌తో 1104 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 3000కు పైగా పరుగులు చేశాడు.

శుభ్‌మన్ గిల్

టీమ్ ఇండియా స్టార్, యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ప్రపంచ కప్ ప్రధాన జట్టులో చోటుద‌క్క‌లేదు. గిల్ రిజర్వు ప్లేయ‌ర్ల లిస్టులో ఉన్నాడు. ఎవ‌రైనా ప్లేయ‌ర్ గాయపడితేనే వారికి అవకాశం లభిస్తుంది. గిల్ భారత్ తరఫున 14 టీ20ల్లో 147 స్ట్రైక్ రేట్‌తో 335 పరుగులు చేశాడు. 100 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 3094 పరుగులు కొట్టాడు.

రింకూ సింగ్

డేంజరస్ ఫినిషర్ గా గుర్తింపు సాధించిన రింకూ సింగ్ కూడా భారత ప్రధాన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేదు. గిల్‌లాగే అతను కూడా రిజర్వ్‌ ఆటగాళ్ల లిస్టులో ఉన్నాడు. భారత్ తరఫున ఫినిషర్‌గా రింకు 15 టీ20 మ్యాచ్‌ల్లో 176 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 356 పరుగులు కొట్టాడు. ఇక ఐపీఎల్ లో అయితే దుమ్మురేపే ఇన్నింగ్స్ తో అద్భుత‌మైన షాట్స్ కొడుతున్న సంగ‌తి తెలిసిందే. 

click me!