కూటమి, వైసీపీ మేనిఫేస్టోల మధ్య పోలిక, వ్యత్యాసాలివే..!

By Rajesh KarampooriFirst Published Apr 30, 2024, 7:41 PM IST
Highlights

TDP, JSP, BJP Manifesto Vs YSRCP Manifesto: ఆంధ్రప్రదేశ్ జరిగే ఎన్నికల కోసం అధికార వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫేస్టో విడుదల చేశాయి. కాగా ఈ రెండు పార్టీ మేనిఫెస్టోలోని అంశాల్లోనూ పోలికలు, వ్యత్యాసాలున్నాయి.

TDP, JSP, BJP Manifesto Vs YSRCP Manifesto: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ పార్టీలన్నీ తమ మేనిఫేస్టోను విడుదల చేశాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించగా.. తాజా టీడీపీ జనసేన బీజేపీ కూటమి మంగళవారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మేనిఫేస్టోలోని అంశాలకు, వైసీపీ పార్టీలో హామీలకు తేడా ఏంటీ ? ఏఏ హామీల్లో సరూప్యత ఉందనే దానిపై ఆసక్తి నెలకొంది.

వృద్దుల కోసం..

వైసీపీ మ్యానిఫెస్టోలో వృద్ధాప్య పెన్షన్లను ప్రస్తుతం ఉన్న రూ.3 వేల నుంచి వచ్చే ఐదేళ్లలో రూ.3500కి పెంచుతామని హామీ ఇచ్చింది.అలాగే..  2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో మరో రూ.250 పెంచుతామని పేర్కొంది. ఇక ఎన్డీయే కూటమి ప్రకటించిన మేనిఫేస్టోలో వృద్దులకు పెద్దపీట వేశారు. అధికారంలోకి వృద్దాప్య ఫించన్ ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే వికలాంగుల పెన్షన్లు రూ.6 వేలకు, పూర్తిగా వికలాంగులైతే రూ.10 వేల ఫించన్ అందిస్తామని హామీ ఇచ్చారు. 

విద్యార్ధుల కోసం 

వైసీపీ మ్యానిఫెస్టోలో పిల్లల చదువుల కోసం.. ప్రస్తుతం ఇస్తున్న అమ్మఒడి మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.17 వేలకు ఇస్తామన్నది. ఇక.. కూటమి మేనిఫెస్టోలో తల్లికి వందనం కింద కుటుంబంలో ముగ్గురు పిల్లల వరకూ రూ.15 వేల చొప్పున అంటే గరిష్టంగా రూ.45 వేల వరకూ ఇస్తామని హామీ ఇచ్చింది.  

రైతుల కోసం..

వైసీపీ మ్యానిఫెస్టోలో రైతులకు పెద్ద పీట వేసింది. రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామని ప్రకటించగా.. టీడీపీ జనసేన బీజేపీ కూటమి మాత్రం  ఏడాదికి ఏకంగా రూ.20 వేలు ఇస్తామని ప్రకటించింది.ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తామని తెలిపింది.

మహిళల కోసం..

45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు చేయూత పథకం ద్వారా ఇచ్చే మొత్తం ఐదేళ్లలో 75 వేలు కొనసాగిస్తామని వైసీపీ హామీ ఇవ్వగా.. కూటమి మాత్రం 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని సంచలన హామీ ఇచ్చింది. అలాగే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ప్రకటించింది. కళ్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగిస్తామని అధికార పార్టీ ప్రకటించింది 

రాజధానిపై ప్రకటన.. 

వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు అమల్లోకి తెస్తామని ప్రకటించగా.. ఎన్డీయే కూటమి అమరావతే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పింది.

నిరుద్యోగుల కోసం.. 

అధికారంలోకి రాగానే మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామనీ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు(Jobs), నిరుద్యోగ యువతకు 3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలు ప్రకటించింది. 

బీసీలకు 

కూటమి .. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ , బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం. చేనేత, మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు.బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు, ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి సరైన పరిష్కార మార్గం సూచిస్తామని అన్నారు. అలాగే.. ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది.అలాగే.. వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు. అలాగే.. స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని కూటమి తెలిపింది.  
 
వైసీపీ తన మేనిఫేస్టోలో చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేల సాయ అందిస్తామని ప్రకటించింది. అలాగే.. ఆటో, ట్యాక్సీ, లారీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ, ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామని ప్రకటించింది. అలాగే..లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు, వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపుతామని అన్నారు.  

ఇతర హామీలు

వైసీపీ మ్యానిఫెస్టోలో లా నేస్తం, కాపునేస్తం, వాహనమిత్ర పథకాలు కొనసాగిస్తామని, అలాగే ఈబీసీ నేస్తాన్ని రూ.45 వేల నుంచి లక్షా 5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. 

click me!