వరలక్ష్మి సినిమాలపై కాబోయే భర్త రియాక్షన్‌ ఏంటంటే.. `శబరి` నుంచి ఇన్‌స్పైరింగ్‌ సాంగ్‌

By Aithagoni RajuFirst Published Apr 30, 2024, 7:20 PM IST
Highlights

తనకు కాబోయే భర్త సచిదేవ్‌ తన సినిమాలపై రియాక్షన్‌ని బయటపెట్టింది వరలక్ష్మి. అదే సమయంలో తాను నటించిన `శబరి` నుంచి స్ఫూర్తిని నింపే పాట బయటకు వచ్చింది. 
 

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తెలుగులో మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ మూవీ `శబరి` చిత్రంలో నటిస్తుంది. కూతురు కోసం పోరాడే తల్లి పోరాటం ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ ఇది. అనిల్‌ కాట్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించిన ఈ చిత్రం మరో మూడు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ సందర్భంగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. ఆమె క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి స్పంచింది. తాను అలాంటి పరిస్థితులను ఫేస్‌ చేశానని, కాకపోతే దాన్ని తిప్పికొట్టినట్టు తెలిపి బాంబ్‌ పేల్చింది. 

అదే సమయంలో తనకు కాబోయే భర్త గురించి కూడా రకరకాలు పుకార్లు వినిపిస్తున్నాయి. వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్‌ సచిదేవ్‌ కి ఆల్‌రెడీ పెళ్లి అయ్యిందని, వరలక్ష్మిని రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, అయితే వరలక్ష్మి డబ్బుకోసమే అతన్ని మ్యారేజ్‌ చేసుకుంటుందనే రూమర్స్ వచ్చాయి. తాజాగా దీనిపై వరలక్ష్మి స్పందించింది. తాను డబ్బు కోసం మ్యారేజ్‌ చేసుకోవడం లేదని, అతని కేరింగ్‌, ప్రేమ తనని ఆకర్షించిందని చెప్పింది. 

అయితే ఇటీవల ఇంటర్వ్యూలో సచిదేవ్‌ తన సినిమాలపై రియాక్షన్‌ గురించి అడగ్గా, అతనికి తన సినిమాలన్నీ నచ్చుతాయని, కాకపోతే జెన్యూన్‌ రిపోర్ట్ ఇస్తాడని తెలిపింది. బాగుంది, బాగాలేదనేది నిర్మొహమాటంగా చెబుతాడట. అయితే బాగా లేదని చెప్పే అవకాశం అతనికి ఇవ్వలేదని చెప్పింది వరలక్ష్మి. తనకు ఆయన అన్ని రకాలుగా సపోర్ట్‌గా ఉంటాడని, తాను మ్యారేజ్‌ చేసుకోవడం ఓ పెద్ద సర్‌ప్రైజ్‌ అని చెప్పింది వరలక్ష్మి. 

ఇదిలా ఉంటే మే 3న `శబరి` సినిమా రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. అందులో భాగంగా సినిమాకి సంబంధించిన పాటలను విడుదల చేస్తున్నారు. తాజాగా `అలసిన ఊపిరి` అంటూ సాగే ఇన్‌స్పైరింగ్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. దర్శకుడు కరుణకుమార్‌ ఈపాటని విడుదల చేయడం విశేషం. గోపీసుందర్ సంగీతంలో రెహమాన్ రాసిన 'అలిసిన ఊపిరి...' పాటను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

'శబరి' నుంచి ఇప్పటి వరకు విడుదలైన గీతాలు తల్లి కూతుళ్ల మధ్య అనుబంధం, ప్రేమను చూపిస్తే... 'అలిసిన ఊపిరి' పాటలో పోరాటానికి సిద్ధమవుతున్న మెయిన్ లీడ్ వరలక్ష్మిని చూపించారు. మధ్యలో కుమార్తె కోసం అన్వేషణలో పడిన తల్లి మనసును సైతం స్పృశించారు. గోపీసుందర్ బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, రెహమాన్ సాహిత్యం దీనినొక మోటివేషనల్ సాంగ్ తరహాలో మార్చాయి.

పాట విడుదల చేసిన అనంతరం దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ, ` 'అలిసిన ఊపిరి' సాంగ్ కి రెహమాన్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. పాట చాలా బావుంది. విజువలైజేషన్ కూడా బాగా చేశారు. మదర్ అండ్ డాటర్ ఎమోషన్ తీసుకుని థ్రిల్లర్ సినిమా చేశారు. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు మహేంద్రనాథ్ తో మంచి అనుబంధం ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి వర్సటైల్ యాక్టర్ ఈ సినిమా చేశారు. ఫిమేల్ ఓరియెంటెడ్ కథలు తక్కువగా వస్తున్న ఈ రోజుల్లో మంచి కథతో సినిమా తీశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా` అని చెప్పారు.   
 

click me!