ఇలా తలస్నానం చేస్తే మీ జుట్టుపట్టులా మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుందన్నా సంగతి మీకు తెలుసా?

First Published Nov 25, 2021, 1:41 PM IST

వాతావరణ కాలుష్యం (Atmospheric pollution), దుమ్ము, ధూళి, పొగ ఇలా అనేక కారణాలతో జుట్టు తొందరగా రఫ్‌గా, డల్‌గా మారిపోవడం జరుగుతుంది. జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే  జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉంటుంది. అందుకే జుట్టు తిరిగి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించాలని వెంటనే తలస్నానం చేస్తుంటాం. కానీ ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలో సరైన అవగాహన వుండదు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా తలస్నానం ఏ విధంగా చేయాలో, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
 

జుట్టు కాస్త డల్ గా, నిర్జీవంగా కనిపించడంతో వెంటనే తల స్నానం చేస్తుంటారు. కానీ ఇలా తలస్నానం చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు (Precautions) తీసుకోవడం అవసరం. అప్పుడే జుట్టు సంరక్షణ (Hair care) బాగుంటుంది. అయితే, ఎలాంటి జుట్టు ఉన్నవారు ఎలా ఎప్పుడు తలస్నానం చేయాలో తెలుసుకోవడం అవసరం.
 

జుట్టు జిడ్డుగా ఉంటే రెండు రోజులకోసారి తలస్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా సాధారణ జుట్టు, పొడి జుట్టు ఉన్న వారు వారానికి రెండు సార్లు తలస్నానం చేయడం మంచిది. అయితే తలస్నానం చేసే సమయంలో తక్కువ గాఢత గల షాంపులను (Low concentration shampoos) ఉపయోగించడం జుట్టు ఆరోగ్యానికి (Health) మంచిది.
 

గాఢత ఎక్కువగా ఉన్న షాంపూలను వాడడం ఈ కారణంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా మారి సహజ సౌందర్యాన్ని (Natural beauty) కోల్పోతుంది. దీంతో జుట్టు సమస్యలు ఏర్పడతాయి. తలస్నానం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తలస్నానం చేయాలనుకున్నప్పుడు ముందుగా జుట్టు చిక్కులు (Implications) లేకుండా చూసుకోవాలి.
 

చిక్కు తీసి బాగా దువ్వుకోవాలి. ఇలా చేయడంతో తల స్నానం చేసే సమయంలో జుట్టు (Hair) ఎక్కువగా రాలదు. అలాగే పెళుసుగా ఉన్న వెంట్రుకలు కూడా తెగిపోకుండా ఉంటాయి. షాంపూను డైరెక్టుగా తలకు అప్లై చేయకూడదు. ఇలా అప్లై చేయడంతో షాంపూలోని రసాయనాలు (Chemicals) జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తాయి.
 

దాంతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. షాంపూను నీటిలో కలుపుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు రెండు నిమిషాలపాటు చేతి వేళ్లతో బాగా మర్దన చేసుకుని తలస్నానం చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా షాంపూతో (Shampoo) మర్దన చేసుకోవడంతో తలలోని రక్తప్రసరణ (Blood circulation) మెరుగుపడుతుంది.
 

జుట్టు కుదుళ్లు శుభ్రపడి జుట్టు రాలిపోయే (Hair loss) సమస్య తగ్గుతుంది. తలస్నానం చేయడానికి చల్లనినీటిని (Cool water) కానీ ఎక్కువ వేడి నీటిని (Hot water) వాడుతారు. ఇలా చేయడం సంరక్షణకు మంచిది కాదు. తలస్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది.
 

చల్లని లేదా వేడి నీటిని వాడటంతో జుట్టు కుదుళ్లు లోపల ఉండే సెబేషియస్‌ గ్రంథులు (Sebaceous glands) దెబ్బతింటాయి. సెబేషియస్‌ గ్రంథులు  దెబ్బతినడంతో జుట్టు పలుచగా, నిర్జీవంగా మారుతుంది. కనుక తలస్నానానికి గోరువెచ్చని నీరే మంచిది. తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఒత్తుగా, నిగారింపుగా ఉండాలంటే కండిషనర్ (Conditioner) తప్పనిసరి.
 

కండిషనర్ (Conditioner) రాసుకుంటే జుట్టు చివర్లు చిట్లకుండా జాగ్రత్తపడచ్చు. తల స్నానం చేసిన వెంటనే తడిగా ఉన్నప్పుడు జుట్టుని దువ్వకండి. తడి జుట్టును ఆరపెట్టుకోవడానికి డ్రయర్లను (Dryers) వాడకండి. డ్రయర్లను ఉపయోగించడంతో జుట్టు సహజసిద్ధమైన తేమను కోల్పోతుంది.

click me!