ఫ్యాషన్ లో శృంగార ప్రకటనలు.. చూస్తే మతిపోవాల్సిందే..

First Published May 14, 2021, 1:37 PM IST

బ్యూటీ, ఫ్యాషన్, సినిమా, టీవీ.. ఇలా ఏ రంగం తీసుకున్నా.. కాదేదీ శృంగారానికి అనర్హం అన్నట్టుగా తయారయ్యాయి. ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెడితే ఫ్యాషన్ ప్రకటనలు చాలా రెచ్చగొట్టేవిగా కనిపించేవి.

బ్యూటీ, ఫ్యాషన్, సినిమా, టీవీ.. ఇలా ఏ రంగం తీసుకున్నా.. కాదేదీ శృంగారానికి అనర్హం అన్నట్టుగా తయారయ్యాయి. ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెడితే ఫ్యాషన్ ప్రకటనలు చాలా రెచ్చగొట్టేవిగా కనిపించేవి.
undefined
ఇప్పటంతఓపెన్ మైండెడ్ లేనప్పటి సమయంలో టామ్ ఫోర్డ్, గూచీ, వైయస్ఎల్ వంటి లగ్జరీ బ్రాండ్లు ఇలాంటి వివాదాస్పద, బహిరంగ లైంగిక ప్రకటన ప్రచారాలతో ముందుకు వచ్చాయి. అప్పుడు వాటిలో కొన్ని నిషేధించబడ్డాయి కూడా.
undefined
దీంతో బ్రాండ్ల అమ్మకాల కొరకు కొత్త ఆలోచనలతో ముందుకు రావడం.. అవి బాగా క్లిక్ అవుతుండడంతో వినియోగదారులు, బ్రాండ్ మేకర్స లో సెక్స్ ఎప్పుడూ సెల్లింగ్ పాయింట్ కాదనే అవగాహన వచ్చింది.
undefined
అయితే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాండమిక్ నేపథ్యంలో ఫ్యాషన్ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో కొన్ని అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కొత్త ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి.
undefined
మనిషిని ముట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితి కాబట్టి.. ఈ బ్రాండ్లు సోషల్ మీడియాలో వారి సృజనాత్మక ప్రకటనల ప్రచారంలో న్యూడిటీ, శృంగారాన్ని చొప్పించడం ద్వారా అటెన్షన్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాయి.
undefined
ఈ బ్రాండ్లలో కొన్ని స్వలింగ జంటలను, వివిధ జాతుల ప్రేమికులను కూడా చేర్చడం ద్వారా మరింత అర్థవంతంగా తయారు చేశాయి. అలాంటి కొన్ని న్యూడిటీ, శృంగారంతో తయారైన కొన్ని లగ్జరీ బ్రాండ్లను ఇవి.
undefined
పారిస్ కు చెందిన డిజైనర్ సైమన్ పోర్టే జాక్వెమస్ స్వలింగ సంపర్కులైన జంటలు ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఉండే పొజిషన్లతో వివిధ రాష్ట్రాల వస్త్రధారణలను ప్రదర్శించడం ద్వారా తిరిగి హ్యూమన్ టచ్ ను తీసుకురావడానికి ప్రయత్నించారు.
undefined
డీజిల్స్ వెన్ టుగెదర్ ప్రచారం నిర్బంధం తరువాత ప్రేమికులు కలుసుకుంటే అనే కాన్సెప్ట్ ను తీసుకుంది. లాక్డౌన్ సమయంలో ఒకరికొకరు దూరంగా ఉండి, ఇప్పుడు శారీరక సాన్నిహిత్యం కోసం ఆరాటపడే జంటలు ఇందులో ఉన్నారు. దీనికోసం వీరు నిజ జీవిత జంటలతో పాటు అనేక ఇతర ప్రాంతాలవారినీ తీసుకుంది.
undefined
పాకో రాబన్నే యొక్క బిల్డ్ లవ్ ప్రచారంలో జాత్యాహంకారాన్ని దూరం చేసేలా తెల్లజాతి మహిళ, నల్లజాతి పురుషుడు గట్టిగా చుంభిస్తున్నట్టుగా ఫోటోషూట్ చేశారు.సూట్ సప్టై అనే న్యూ నార్మల్ యాడ్ తో బహిరంగ ప్రచారంతో కనుబొమ్మలు పెద్దవి చేసే ప్రచారానికి తెరతీసింది. ఇక్కడ మోడళ్లు కెమెరా ముందు ఉద్వేగభరితమైన ముద్దును పంచుకుంటాయి. ఈ ప్రచారానికి మిశ్రమ స్పందన వచ్చింది.
undefined
click me!