చిట్లిన జుట్టుకు.. ఇంట్లోనే ఈ హెయిర్ మాస్కులు ట్రై చేయండి...

First Published Aug 17, 2021, 3:20 PM IST

పెరుగు, ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ : ఆలివ్ ఆయిల్ లో ఫాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టులోని తేమను లాక్ చేసి చిట్లకుండా ఆపుతుంది. 

జుట్టు చిట్టిపోవడం తరచుగా ఎదురయ్యే అతి సాధారణ సమస్య. దీనివల్ల జుట్టు పొడిగా మారుతుంది. చిట్లిన జుట్టు వల్ల జుట్టుపెరగడం ఆగిపోతోంది. హార్డ్ కెమికల్స్, హెయిర్ డ్రయ్యర్, సాఫ్ట్ నర్ లాంటి హీట్ పరికరాలు జుట్టుకు నష్టం కలిగిస్తాయి. జుట్టూడిపోవడానికి దోహదం చేస్తాయి. అయితే దీనికి ఇంట్లోనే సింపులు మాస్కులతో చికిత్స చేసుకోవచ్చు. 

పెరుగు, ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ : ఆలివ్ ఆయిల్ లో ఫాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టులోని తేమను లాక్ చేసి చిట్లకుండా ఆపుతుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. తలమీది మృతకణాలను ఇది తొలగిస్తుంది. ఆరోగ్యకరమైన స్కాల్ప్.. వల్ల జుట్టు మరింత ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌తో అర కప్పు పెరుగును మిక్స్ చేసి హెయిర్ మాస్క్‌ తయారు చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. 

గుడ్డు పచ్చసొన, తేనె హెయిర్ మాస్క్ : తేనె సహజమైన హ్యూమెక్టెంట్, ఇది జుట్టు పొడిబారకుండా, తేమను లాక్ చేస్తుంది. గుడ్లలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు చీలికలను మరింత పెరగకుండా ఆపుతాయి. ఈ రెండు పదార్థాలు జుట్టు మెరుపును పెంచుతాయి, బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. 

దీనికోసం చేయాల్సిందల్లా గుడ్డులోని పచ్చసొనను 1 టీస్పూన్ తేనెతో కలిపి మాస్క్ ను తయారు చేసుకోవాలి. ఈ మాస్క్ ను జుట్టుకు పట్టించి. గంట తరువాత తేలికపాటి షాంపూతో కడిగేసుకోవాలి. 

కొబ్బరి నూనె : జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి కొబ్బరి నూనె ఉత్తమమైన నూనెలలో ఒకటి. అర కప్పు కొబ్బరి నూనెను మైక్రోవేవ్‌లో 15 సెకన్ల పాటు వేడి చేసి, పొడి జుట్టుకు అప్లై చేయాలి. మీకు నూనె మొత్తం పెట్టుకోవడం ఇష్టం లేకపోతే...  మాడుకు, జుట్టు చివర్లకు అప్లై చేసుకున్నా సరిపోతుంది. తరువాత తలను టవల్‌ గానీ, షవర్ క్యాప్ పెట్టుకుని కనీసం 30 నిమిషాలు అలాగే ఉంచండి. తేలికపాటి షాంపూతో స్నానం చేయాలి. 

ఆపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ రిన్స్ : వెనిగర్ తో జుట్టును కడగడం వల్ల జుట్టు మృధువుగా తయారవుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లోని ఎసిటిక్ యాసిడ్ జుట్టులోని మురికిని తొలగిస్తుంది. జుట్టును బలోపేతం చేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలంటే.. 1 కప్పు నీరు మరిగించి, చల్లబరచాలి.. ఈ నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి.. ఈ నీటితో షాంపూతో తలస్నానం చేసిన తరువాత జుట్టుకు పట్టించాలి. ఒక్క నిమిషం తరువాత కడిగేయాలి.

click me!