Immunity: మీకు తెలుసా.. అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ తో అదిరిపోయే అద్భుతాలు జరుగుతాయట..

First Published Jan 25, 2022, 4:54 PM IST

Immunity: కరోనా కష్టకాలంలో బయటపడాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కరోనా సోకినా దాన్ని తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. అందుకోసం సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే రోగ నిరోధక శక్తిని ఆయిల్ మసాజ్ ద్వారా కూడా.. 

Immunity:ప్రపంచ దేశాలన్నీ ఒమిక్రాన్ రాకతో మరింత అప్రమత్తం అయ్యాయి. థర్డ్ వేవ్ అంటూ సునామిలా విరుచుకుపడుతున్నవేళ ఈ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఈ వేరియంట్ అంటు వ్యాధిలా మారి ఒకరి నుంచి మరొకరికి చాలా ఫాస్ట్ గా సోకుతుండటం మరింత ఆందోళన కలిగించే విషయం. అందులోనూ రెండు డోసుల టీకా వేసుకున్నా, వేసుకోకపోయినా అందరికీ వేగంగా అంటుకుంటోంది. ఇలాంటి సందర్భంలో మనల్ని మనం రక్షించుకోవడం అత్యవసం. అందులోనూ దీని బారిన పడినా త్వరగా బయటపడాలంటే రోగ నిరోధక శక్తి (Immunity Power)చాలా అవసరం. అంతేకాదు ఈ రోగ నిరధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదే ఎటువంటి రోగం నుంచైనా మనల్ని బయటపడేయగలదు. ఈ ఇమ్యూనిటీ పవర్ ఆహారం తీసుకోవడం ద్వారానే కాదు ఆయిల్ మసాజ్ వల్ల కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అదెలాగో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
 

ఆయిల్ మసాజ్ చేయించుకుంటే మనం తీసుకున్న పోషకాలన్నీ బాడీ మొత్తానికి బాగా చేరుతాయి. అలాగే Blood circulation కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ మసాజ్ తో శరీర నొప్పిల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఒత్తిడిని కూడా దూరం చేయడంలో మసాజ్ బాగా సహాయపడుతుంది. తద్వారా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాగా ఆయిల్ మసాజ్ వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే ఇలాంటి ప్రయోజనాలు పొందాలంటే ఆయిల్ మసాజ్ ఎప్పుడు చేయాలి.. ఏ ఆయిల్ వాడాలి వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ మసాజ్ ఆయిల్ ను లావెండర్, యూకలిప్టస్, లవంగం, టీ ట్రీ ద్వారా తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ ఎసెన్షియల్ నూనెలు బెరడు, ఆకులు, పువ్వులు వంటి వాటి నుంచి తయారు చేస్తారు. ఇవి Immune cells పనితీరును మెరుగుపడేలా చేస్తాయి. అయితే ఈ ఆయిల్ మసాజ్ ఖాళీ కడుపుతో ఉన్నపుుడు చేయించుకోకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియను Stimulates చేస్తుంది కాబట్టి. అంతేకాదు ఈ ప్రక్రియ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గేలా చేస్తుంది. 

అందుకే ఉదయమైనా, సాయంత్రమైనా తిన్న తర్వాతే ఈ మసాజ్ చేయించుకోండి. ఈ మసాజ్ ఎప్పుడు చేసుకున్నా ఏం కాదు కానీ.. ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే ఉదయాన్నే చేయించుకోవాలి. ఎందుకంటే ఉదయం పూట ఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు కాబట్టి. ఒక వేల ఉదయం కష్టమనుకుంటే మధ్యాహ్నం అయినా చేయించుకోవచ్చు. కానీ ఎప్పుడు చేయించుకున్నా ముందు తినడం మాత్రం మర్చిపోవద్దు. 

click me!