New Year Resolution : మనలో చాలా మంది న్యూ ఇయర్ ప్రారంభానికి ముందే ఎన్నో వాగ్దానాలు చేస్తుటాం. మన జీవితాన్ని మెరుగ్గా ఉంచడానికి ఎన్నో తీర్మానాలు కూడా చేస్తుంటాం. కానీ వాగ్దానాలు, తీర్మానాలు మొదటినెలలోనే కనుమరుగవుతాయి. అసలు నేను ఈ పనులు చేయాలనుకున్నా అనే విషయాలను కూడా మర్చిపోతుంటాం. నిజానికి సంవత్సరం మనం చేసే కొన్ని వాగ్దానాలు చాలా సులువుగా ఉండటమే కాదు.. ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. వ్యక్తిత్వ వికాసం కోసం మనం కొత్త సంవత్సరంలో మనం చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పనిని వాయిదా వేయడం
మనలో చాలా మందికి ఈ అలవాటు ఖచ్చితంగా ఉంటుది. ఇప్పుడు చేయాల్సిన పనిని తర్వాత చేద్దాంలే.. అని వాయిదా వేస్తూ ఉండటం మనకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఏ పనినైనా వాయిదా వేయడం వల్ల అది మన వ్యక్తిగత ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఈ అలవాటును అధిగమించడానికి జీవితంలో క్రమశిక్షణను తీసుకురండి. లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత పనిని విభజించండి. దీనివల్ల పనుల్లో ఆలస్యం అనేదే ఉండదు. అలాగే మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇలా చేయడం వల్ల మీలో సంతృప్తి భావన పెరుగుతుంది.
Image: Getty Images
ఫెయిల్ అవుతాననే భయం
నిపుణుల ప్రకారం.. మీరు ఏదైనా పనిలో ఓటమి భయం నుంచి విముక్తి పొందితే.. కొత్త ప్రయత్నాలు అస్సలు వెనకాడరు. నిజానికి ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు పొరపాట్లు జరగడం చాలా సహజం. వైఫల్యం అభ్యాస ప్రక్రియలో ఒక భాగం మాత్రమే ఇది. మీకు తెలుసా? మనం తప్పుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటాం. ఇవి మనం మరింత పట్టుదలతో ఉండటానికి, ముందుకు సాగడానికి సహాయపడతాయి.
తప్పులను అంగీకరించకపోవడం
తప్పులు చేయడం చాలా కామన్. కానీ తెలిసి తప్పులు చేయకూడదు. అయితే మనలో చాలా మంది తప్పులు చేసినా.. వాటిని అస్సలు అంగీకరించరు. స్వీయ అవగాహనను పెంచుకుంటే.. మిమ్మల్ని మీరు సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. అలాగే మీ లోపాలను అర్థం చేసుకుంటారు. ఎలా ముందుకు వెళ్లాలి? ఎలాంటి ప్రయత్నాలు చేస్తే విజయం సాధిస్తారో తెలుసుకుంటారు.
ఆలస్యంగా నిద్రలేవడం
మీరు రోజంతా చురుగ్గా ఉండటానికి, పనులను తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ఉదయాన్నే నిద్రలేవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది నైట్ లేట్ గానే నిద్రపోతారు. దీని ప్రభావం వారి దినచర్య, పనివేళలపై కనిపిస్తుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీ రోజును ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకోవచ్చు.
కంఫర్ట్ జోన్ లో ఉండటం
కంఫర్ట్ జోన్ నుంచి బయటపడకపోతే జీవితంలో పురోగతిని సాధించడం చాలా కష్టం. జీవితంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మీరు వ్యక్తిగతంగా ఎదగగలుగుతారు. అలాగే మీలో కొత్త ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసే ధైర్యం వస్తుంది.
వ్యాయామం చేయకపోవడం
రెగ్యులర్ గా వ్యాయామం చేసే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ కొత్త సంవత్సరంలో ఇలా మాత్రం ఉండకండి. మీరు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అందుకే ఉదయం వ్యాయామం చేయడానికి కొంత సమయాన్ని కేటాయించండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీ శరీరంలో శక్తి స్థాయిని కూడా పెరుగుతుంది. స్టామిలాను పెంచే వ్యాయామాలు ఏదైనా నేర్చుకోవాలనే కోరికను కలిగిస్తాయి.