బ్రియాన్ లారా-వివ్ రిచర్డ్స్‌లను గురిపెట్టిన విరాట్ కోహ్లీ

First Published | Nov 28, 2024, 6:10 PM IST

Virat Kohli's records: టెస్టు క్రికెట్ లో గ‌త కొన్ని మ్యాచ్ లుగా విరాట్ కోహ్లీ విఫ‌ల‌మ‌వుతూ వ‌చ్చాడు. అయితే, ఆసీస్ తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్ లో సెంచ‌రీతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇప్పుడు లెజెండ‌రీ ప్లేయ‌ర్ల‌ను టార్గెట్ చేశాడు. 
 

Image Credit: Getty Images

Virat Kohli's records: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భార‌త్-ఆస్ట్రేలియాలు ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడుతున్నాయి. తొలి మ్యాచ్ లో భారత జట్టుకు శుభారంభం లభించింది. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Image Credit: Getty Images

ఇక రెండవ టెస్ట్ పింక్ బాల్ డే-నైట్ టెస్ట్ మ్యాచ్. ఇది డిసెంబర్ 6 నుండి అడిలైడ్ వేదిక‌గా జరుగుతుంది. ఈ మైదానం విరాట్ కోహ్లీకి ఇష్టమైన మైదానాల్లో ఒకటి, ఇక్కడ అతను ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేయడానికి, పరుగుల రాబ‌ట్ట‌డానికి చాలా  ఇష్టపడతాడు. రాబోయే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్  నుంచి ప‌రుగులు వ‌స్తే లెజెండ‌రీ ప్లేయ‌ర్లు బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్ వంటి ఎందరో గొప్ప బ్యాట్స్‌మెన్‌ల రికార్డుల‌ను బ్రేక్ చేస్తాడు. 


మళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన విరాట్ కోహ్లీ 

ఫామ్‌తో సతమతమవుతున్న స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ లో భాగంగా పెర్త్ మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన‌తో తన టెస్టు కెరీర్‌లో 30వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 

అతని అజేయ సెంచరీతో ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై కంగారుల‌ను కంగారెత్తించాడు. ఈ సెంచ‌రీతో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా విరాట్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలో అత్యధికంగా 7 టెస్టు సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (6 సెంచరీలు) రికార్డును బద్దలు కొట్టాడు.

Virat Kohli Photo Shoot

అడిలైడ్‌లో అద్భుతాలు చేస్తానంటున్న విరాట్ కోహ్లీ 

తొలి మ్యాచ్ లాగే అడిలైడ్ వేదికగా జరగనున్న పింక్ బాల్ డే నైట్ టెస్టు మ్యాచ్ లోనూ విరాట్ బ్యాట్ బాగా ఆడితే.. వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా వంటి ఎందరో లెజెండ‌రీ ప్లేయ‌ర్ల రికార్డుల‌ను బ్రేక్ చేయ‌నున్నాడు. అడిలైడ్‌లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన పరంగా విరాట్ కోహ్లీ వారిని అధిగ‌మించ‌నున్నాడు. వివ్ రిచర్డ్స్ (552 పరుగులు)ను అధిగమించేందుకు విరాట్ 44 పరుగులు చేయాల్సి ఉండగా, బ్రియాన్ లారా (610 పరుగులు)ను అధిగమించేందుకు కోహ్లీకి 102 పరుగులు కావాలి.

అడిలైడ్‌లో విరాట్  కోహ్లీకి అద్భుతమైన రికార్డు

విరాట్ కోహ్లీకి అడిలైడ్ ఓవల్‌లో బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. విరాట్‌కు ఈ మైదానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డ‌ని అత‌ని గణాంకాలే చెబుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ ఆడిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో 509 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 141 పరుగులు. ఈ మైదానంలో విరాట్ చివరిసారిగా 2020లో ఆడాడు. అడిలైడ్ ఓవల్‌లో విరాట్ సగటు 60కి పైగా ఉండ‌టం విశేషం.

Latest Videos

click me!