Mohammed Shami : బెంగాల్ నుంచి రంజీ ట్రోఫీలో..
ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భారత టెస్టు జట్టులో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రీఎంట్రీ కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాయం కారణంగా చాలా కాలం పాటు దూరమై ఇటీవలే పోటీ క్రికెట్‌కు తిరిగి వచ్చిన మహ్మద్ షమీని బీసీసీఐ వైద్య బృందం పరిశీలిస్తోంది.
బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో అతను త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఇదే సమయంలో అతని ముందు ఒక పెద్ద కండీషన్ కూడా ఉంది.
Mohammed Shami
మహ్మద్ షమీ ముందు పెద్ద సవాల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) T20 టోర్నమెంట్‌లో అతని ప్రదర్శన ఆధారంగా మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మహ్మద్ షమీ కొంత బరువు తగ్గడమే కాకుండా పూర్తి ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంటుందని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి.
మహ్మద్ షమీ పూర్తిగా కోలుకుంటే, అతను డిసెంబర్ 14 నుండి బ్రిస్బేన్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టులో ఆడవచ్చు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది.
Mohammed Shami
షమీకి బీసీసీఐ కఠిన గడువు విధించింది
పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో స్టాండ్-ఇన్ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 8 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయగా, అరంగేట్రం ఆటగాడు హర్షిత్ రాణా 4 వికెట్లు తీయడంతో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాబట్టి తర్వాతి మ్యాచ్ లలో ఇదే జట్టును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి షమీ ఫిట్ నెస్ విషయంలో ఒత్తిడి తీసురావద్దని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.
Mohammed Shami
పలు మీడియా నివేదికల ప్రకారం.. 'బీసీసీఐ వైద్య బృందంలో మహ్మద్ షమీకి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి. మహ్మద్ షమీ మ్యాచ్‌లు ఆడుతున్నందున, అతని బరువు తగ్గుతాడు. ఇది అతని స్టామినాను బలోపేతం చేస్తుందని' వైద్య బృందం అభిప్రాయపడింది. రంజీ ట్రోఫీ దశ ముగిసినందున, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) మొదటి రౌండ్ మ్యాచ్‌లు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఇక్కడి ప్రదర్శనలు షమీకి చాలా కీలకం.
అలాగే, బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ హెడ్ నితిన్ పటేల్, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) ట్రైనర్ నిశాంత్ బోర్డోలోయ్ బెంగాల్ జట్టుతో షమీ శిక్షణ-రికవరీ రొటీన్‌కు విషయాల్లో అతని కోసం పనిచేస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ (SMAT)లో షమీ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి 10 రోజుల సమయం ఉండగానే నవంబర్ 23న మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని షమీ మళ్లీ క్రికెట్‌లోకి రావడానికి తొందరపడడం లేదని నివేదిక పేర్కొంది.
Mohammed Shami
ఛాంపియన్స్ ట్రోఫీపై సెలక్టర్లు ఆందోళన.. షమీ వస్తాడా?
'సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీ (SMAT)లో T20 మ్యాచ్‌లలో రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం మెరుగైన ప్రదర్శన ఆట తీరు కాదు. ఉన్నత స్థాయి టెస్ట్ సిరీస్‌లో తీవ్రతను కొనసాగించడం అనేది ఒక విభిన్నమైన గేమ్. అతను SMAT ఛాలెంజ్‌ను క్లియర్ చేస్తే, అతన్ని టీమ్ ఇండియాతో శిక్షణకు పంపవచ్చు, కానీ అతనికి ఇంకా ఇక్కడ శిక్షణ ఇవ్వడం మంచి నిర్ణయం. ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సెలక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారని' సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.