సమంత నుంచి అనుష్క వరకూ ఫిట్‌నెస్ కోసం యోగా చేసే హీరోయిన్లు ఎవరో తెలుసా..?

First Published | Nov 28, 2024, 6:44 PM IST

ఫిట్‌నెస్ మరియు ఆరోగ్యం కోసం యోగాను అనుసరించే ఏడుగురు  స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..? 

యోగాతో ఫిట్‌నెస్‌

మహమ్మారి కరోనా సమయంలో, ఒత్తిడి , ఆరోగ్య నిర్వహణ కోసం యోగా ప్రాముఖ్యత పెరిగింది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా యోగా వెంట పడుతున్నారు.  తమ ఫిట్‌నెస్ దినచర్యలలో యోగాను చేర్చుకున్న 7 మంది ఇండియన్ స్టార్ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఏరియల్ యోగా చేస్తున్న సమంత

ఫిట్‌నెస్ ఐకాన్ సమంత రూత్ ప్రభు, ఏరియల్ యోగాను ఎక్కువగా ఆచరిస్తున్నారు. తలకింద్రులుగా వేళ్ళాడుతూ చేసే ఈ ప్రక్రియతో ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నారు సమంత. 


యోగాభ్యాసం చేస్తున్న దీపికా పదుకొణె

దీపికా పదుకొణె లాక్‌డౌన్ సమయంలో తన యోగా ఆసనాలతో ఫిట్‌నెస్ ను కాపాడుకోవడంతో పాటు.. అద్భుతమైన ఫలితాలను కూడా సాధించింది.  తన యోగా మ్యాట్ పట్ల తనకున్న ప్రేమను పంచుకుంది.

యోగా ప్రియురాలు మలైకా అరోరా

యోగా చేయడంతో పాటు  మద్దతుగా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది మలైకా అరోరా. ఎప్పటికప్పుడు తానుఫిట్ గా ఉండటంతో పాటు ముంబయ్ లో యోగా స్టూడియోను కూడా నడుపుతున్నారు  మలైకా అరోరా.

యోగా చేస్తున్న అనుష్క శెట్టి

హీరోయిన్ అనుష్క శెట్టి... యోగా సాధకురాలు మాత్రమే కాదు బోధకురాలు కూడా.  అనుష్క శెట్టి  మోగాలో మాస్టర్.. ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగంగా కావాలి అని ప్రచారం కూడా చేసింది అనుష్క. 

యోగాసనం వేస్తున్న కరీనా కపూర్

ఆరోగ్యకరమైన జీవనశైలికి మారు పేరుగా నిలిచింది కరీనా కపూర్, ఏరియల్ యోగా మరియు సూర్య నమస్కారంతో సహా వివిధ రకాల యోగాలను అభ్యసిస్తుంది.

విపశ్యన చేస్తున్న శ్రియ శరణ్

శ్రియ శరణ్ పెళ్లై పిల్లలు ఉన్న తరువాత కూడా ఇంత నాజూగ్గా ఉండటాినికి కారణం యోగా. ప్రతీరోజు యోగా అభ్యాసం చేస్తూ.. తనను తాను ఫిట్ గా ఉంచుకుంటుంది శ్రీయా. తన శరీరంపై తాను పట్టు సాధించడంతో పాటు తనను తాను కంట్రోల్ చేసుకోగలదని నిరూపించింది. 

యోగా చేస్తున్న త్రిష

40 ఏళ్ళు వచ్చినా త్రిష ఇంత నాజూగ్గా ఉండటానికి కారణం యోగానే.  తనకు ఇష్టమైన వ్యాయాయంగా యోగాను ఉపయోగిస్తుంది త్రిష. జిమ్ములో ఇబ్బందిపడేబదులు ఇంట్లో ప్రశాంతంగా యోగా చేయడం మేలు అంటోంది స్టార్ హీరోయిన్. 

Latest Videos

click me!