చిరంజీవి చాలా ఇష్టంగా తినే కూర ఏంటో తెలుసా..? మెగాస్టార్ భోజనం ప్లేట్ లో ఆ ఐటం పక్కాగా ఉండాల్సిందే

First Published | Nov 28, 2024, 5:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి చాలా ఇష్టంగా వదలకుండా తినే ఫుడ్ ఐటం ఏంటో తెలుసా..? ఆయన భోజనం ప్లేట్ లో ఆ ఐటం పక్కాగా ఉండాల్సిందేనట. ఇంతకీ ఆయన అంతలా తినే కర్రీ ఏంటో తెలుసా..?
 

Chiranjeevi

70 ఏళ్ళకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అయినా సరే  ఏమాత్రం గ్రేస్ తగ్గకుండా అదే డాన్స్, అదే పెర్ఫామెన్స్ చూపిస్తూ.. దూసుకుపోతున్నారు.  ఫిట్ నెస్ విషయంలో కాని.. సినిమాల విషయంలో కాని.. కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నారు చిరంజీవి.

ఒక రకంగా యంగ్  స్టార్స్ ను  మించిన హుషారుతో దూసుకువెళ్తున్నారు. ఏవిషయంలో కూడా యువతతో తగ్గడంలేదు చిరంజీవి. అయితే మెగాస్టార్  గురించి అందరికి తెలిసిందే. కాని ఆయన పర్సనల్ విషయాలు ఎంత మందికి తెలుసు.మరీముఖ్యంగా ఆయనకు ఏ ఫుడ్ ఇష్టంగా తింటారో మీకు తెలుసా..? 

చిరంజీవి మంచి భోజన ప్రియుడు. కాని ఆయన హీరో అవ్వడంతో ఫిజిక్ ను మెయింటేన్ చేయడం కోసం కాస్త తిండిని బ్యాలన్స్ చేస్తుంటారట. ఎంత ఇష్టమైన పుడ్ అయినా సరే  అతిగా కాకుండా  మితంగా తింటుంటారు. అయితే తనకు ఇష్టమైన ఫుడ్ ప్లేట్ లో ఉంటే మాత్రం ఆరోజు కాస్త హెవిగానే పట్టిస్తారట మెగాస్టార్. ఇక  ఆయనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ కు సంబంధించిన ఓన్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Also Read: రామ్ చరణ్ - రవితేజ్ కాంబినేషన్ లో మిస్ అయిన భారీ మల్టీ స్టారర్...? కారణం ఆ హీరోనేనా..?
 


ఓ సందర్భంలో సినిమా ఫంక్షన్ లో.. అందరిముందు యాంకర్ సుమ ఈ ప్రశ్నను మెగాస్టార్ చిరంజీవిని అడిగింది. అయితే ఈ ప్రశ్న కూడా ఆడియన్స్ నుంచి వచ్చింది కావడంతో చిరంజీవి సమాధానం చెప్పారు., రాజమౌళి అనే మెగా ఫ్యాన్స్ ఈ ప్రశ్నను పేపర్ మీద రాసి ఇచ్చాడు.

ఇలా కొన్ని ప్రశ్నలు సేకరించి.. సినిమా ఫంక్షన్ లో అడిగారు. అందులో భాగంగా సుమ అడుగుతూ..  నాటు కోడి , చేపల పులుసు ఈ రెండింటిలో బాగా ఇష్టంగా తినేది ఏంటి అని మెగాస్టార్ ను అడిగారు సుమ. దాంతో చిరంజీవి నోరు ఊరిపోతుంది అంటూ..ఈరెండు వదలకుండా తింటాను అన్నారు. 

Also Read: రజినీకాంత్ తల్లిగా ఆరాధించే ఈ చిన్నారి ఎవరో తెలుసా ?

అయితే రెండింటిలో ఒకటి మాత్రమే ఆప్షన్ గా తీసుకోవాలి అంటే మాత్రం ఎప్పటికీ చేపల పులుసు అంటే చాలా ఇష్టం అని సమాధానం చెప్పారు చిరంజీవి. అందులోను మెగాస్టార్ కు.. ఆయన మాతృమూర్తి అంజనాదేవి చేతులు మీదుగా చేసిన చేపల కూర అంటే చాలా ఇష్టమంట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. అంతే కాదు తన చేతులు మీదుగా ఓసారి చేపల వేపుడు చేసి పెట్టారు కూడా. 
 

రీసెంట్ గా  పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ఆయనకు అందించారు ప్రతినిధులు. గిన్నిస్ బుక్ ఏజంట్ తో పాటు..  హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా పాల్గోన్నారు. అంతే కాదు చిరంజీవికి ఈ అవార్డు ఆయనే స్వయంగా  అందజేశారు. 156కి పైగా సినిమాల్లో చిరంజీవి చేసిన డాన్స్ కు.. ఆయన డాన్స్ లో చేసిన ప్రయోగాలుకు ఈ అవార్డ్ వరించింది. 

భారతీయ చలనచిత్ర రంగంలో ఫ్రొలిఫిక్ ఫిలిం స్టార్‌గా గిన్నిస్ రికార్డును అందుకున్నారు చిరంజీవి. 45 ఏళ్ల సినీ కెరీర్‌లో 156 సినిమాల్లో చిరంజీవి నటించారు. ఈ సినిమాలన్నింటిలో దాదాపు  537 పాటలలో 24000 డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు చిరంజీవికి  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్  అవార్డు దక్కింది. టాలీవుడ్ లో డాన్స్ అంటే చిరు.. చిరు అంటే డాన్స్ అన్న విధంగా మార్చేశారు. 
 

Latest Videos

click me!