అసలు ఈ కొత్త సంవత్సరం ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా?

First Published | Dec 29, 2023, 9:43 AM IST

New Year 2024: పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేసి.. కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పేసే సమయం దగ్గరకొచ్చింది. న్యూ ఇయర్ ను కూడా ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. వారం ముందు నుంచే న్యూ ఇయర్ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి? ఎలా రెడీ అవ్వాలి? పార్టీ ఎలా చేసుకోవాలి? ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి? అంటూ ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు యువత. అయితే ఈ కొత్త సంవత్సరం ఎలా స్టార్ట్ అయ్యిందో ఎంతమందికి తెలుసు?
 

New Year 2024: కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలనే ఉద్దేశం దాదాపుగా ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది. ఇది మెసొపొటేమియా బాబిలోనియన్ నాగరికత సమయంలో ప్రారంభమైందట. ఆ సమయంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేవారు. ఇలాంటి పరిస్థితిలో.. బాబిలోను ప్రజలు పన్నెండు రోజుల పండుగగా జరుపుకునే కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడ౦ స్టార్ట్ చేశారు. 
 

అయితే ఈ పన్నెండు రోజుల్లో వీళ్లు.. పన్నులు చెల్లిస్తామని, అప్పు తీసుకున్న పనిముట్లను తిరిగి ఇచ్చేస్తామని, వారి స్నేహితులు, పొరుగువారితో మంచి సంబంధాలను ఏర్పరుచుకుంటామని తమ రాజు, స్నేహితులకు వాగ్దానం చేసేవారట. అంటే అప్పటి నుంచే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకున్నారన్న మాట. అయితే చైనా ప్రజలు ఈ తీర్మానాన్ని ఎంతో అదృష్టంగా భావించేవారట. అలాగే రోమన్లు ఈ న్యూ ఇయర్ నాడు తమ దేవుడిని పూజించేవారు. ఒకరకంగా చెప్పాలంటే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకోవడం వేల సంవత్సరాల నాటిదే.
 

Latest Videos


కొత్త సంవత్సరం ఎప్పుడు మొదలైంది?

మొదటి న్యూ ఇయర్ మార్చిలో ప్రారంభమైంది. దీనిలో ఏడాదిలో పది నెలలు, ఎనిమిది రోజులు మాత్రమే ఉన్నాయి. ఏడాదిలో కేవలం 310 రోజులు మాత్రమే ఉండేవని అందరికీ తెలుసు. కానీ తర్వాత ఖగోళ శాస్త్రవేత్తలు రోజుల లెక్కింపు ఆధారంగా దీనిని సవరించారు.


జనవరి 1వ తేదీని నూతన సంవత్సరంగా జరుపుకున్న రోమన్ పాలకులు

రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ జనవరి 1 న నూతన సంవత్సరాన్ని జరుపుకున్న మొదటి వ్యక్తి.  ఈయన ఖగోళ శాస్త్రజ్ఞుల నుంచి సమాచారం రాబట్టి భూమి 365 రోజుల ఆరు గంటలు సూర్యుడి చుట్టూ తిరుగుతుందని కనుగొన్నారు. అందుకే జూలియస్ సీజర్ సంవత్సరానికి 310 రోజులు కాదని..  సంవత్సరానికి 365 రోజులు, 6 గంటలు ఉన్నాయని అందరికీ చెప్పాడు. దీని ఆధారంగానే సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. 

లీప్ ఇయర్ ఇలా..

ఏదేమైనా ఈ అంశంపై ఎంతో చర్చ జరిగింది. దీనిలో పోప్ గ్రెగరీ జూలియస్ సీజర్ ఈ క్యాలెండర్లో లీప్ ఇయర్ లేకపోవడం కనుగొన్నాడు. దీంతో అతను తన మత గురువుతో చర్చించాడు. అతని పేరు గురు సెయింట్ బీడ్. ఏడాదిలో 365 రోజులు, 6 గంటలు కాదని, 365 రోజులు 5 గంటల 46 సెకన్లు ఉన్నాయన్నారు. దీని ఆధారంగా లీప్ ఇయర్ కూడా బయటకు వచ్చి ఆ తర్వాత లెక్కలు పూర్తి చేశారు. తర్వాత రోమన్ క్యాలెండర్ ను తొలగించి గ్రెగోరియన్ క్యాలెండర్ రూపొందించబడింది. అప్పటి నుంచి కొత్త సంవత్సరాన్ని జనవరి 1 న జరుపుకోవడం ప్రారంభించారు. ఇక ఈ న్యూ ఇయర్ ను ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. 

click me!