నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో అమ్మవారికి ఉపవాసాలు మొదలు పెట్టారు. ఈ తొమ్మిది రోజులు అత్యంత నిష్టగా ఉపవాసం ఉంటూ, ప్రార్థనలు, సాత్విక ఆహారాలతో గడుపుతారు. ఈ యేడు, శార్దియ నవరాత్రి 2021 అక్టోబర్ 7, 2021 నుండి అక్టోబర్ 15, 2021 వరకు జరుపుకుంటున్నారు.
ఈ పండుగ భూమిపై దుర్గా దేవి ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ 9 రోజుల్లో, భక్తులు దుర్గాదేవి తొమ్మిది అవతారాలకు ప్రత్యేక నైవేద్యాలు, పూజలు, ప్రార్థనలు చేస్తారు. నవరాత్రుల్లో భక్తులు తమ భక్తితో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు. కొంతమంది తొమ్మిది రోజులూ ఉపవాసం పాటిస్తుండగా, మరికొందరు రెండు రోజులు ఉపవాసం ఉంటారు. నవరాత్రి మొదటి రెండు రోజులు లేదా చివరి రెండు రోజులు ఉపవాసాన్ని ఆచరిస్తారు.
అయితే ఉపవాసం ఉండగానే సరిపోదు దీనికి ఉన్న ఉపవాస నియమాలు పాటించాలి. లేకపోతే భక్తకి బదులు నీరసం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఉపవాసం చేస్తూనే రోజంతా ఉత్సాహంగా, శక్తితో ఉండడానికి చేయవలసినవి ఇవి...
Fasting
- ఉపవాసం ఉన్నప్పుడు, ఆకలితో ఉండకండి. ప్రతి రెండు గంటలకు ఏదైనా నట్స్ లేదా పండ్లు తింటుండాలి.
-ఈ తొమ్మిది రోజుల ఉపవాసంలో, నవరాత్రి ఆహారంలో ఆల్కలీన్ డైట్ ఒకటి. అంటే నట్స్, పండ్లు, పాలు, వెన్న వంటి పాల ఉత్పత్తులు.. కుట్టు కా అట, సింఘరే కా ఆటా లేదా రాజ్‌గిరా కా ఆటా లాంటివి తినొచ్చు.
- రోజంతా నీరు, పాలు, మజ్జిగ మరియు తాజా రసాలను త్రాగడం వలన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.
- నవరాత్రి సమయంలో వంటల్లో టేబుల్ సాల్ట్ బదులు రాతి ఉప్పును వాడండి. మసాలాలు, సుగంధ ద్రవ్యాలు వాడాల్సి వస్తే.. జీలకర్ర, దాల్చినచెక్క, ఆకుపచ్చ ఏలకులు, లవంగాలు, మిరియాల పొడి, కారం పొడి, నల్ల మిరియాలు వాడాలి.
నవరాత్రి ఉపవాస నియమాల్లో చేయకూడనివి
- నిపుణుల అభిప్రాయం ప్రకారం, నవరాత్రి సమయంలో వండే ఆహారాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలను వాడకూడదు. అలాగే, వేడి ఉత్పత్తి చేసే ఆహారాలైన ఆవనూనె లేదా నువ్వుల నూనె వంటి నూనెలకు దూరంగా ఉండాలి.
- ఇవి కాకుండా, మాంసం, గుడ్డు, మద్యం, పొగాకు వినియోగం కూడా నవరాత్రి సమయంలో ఖచ్చితంగా నిషేధం.
- ఉపవాసం ఉండేవాళ్లు, సంధ్య ఆర్తి లేదా సూర్యాస్తమయానికి ముందు పూర్తి భోజనం లేదా చివరి భోజనం చేయవద్దు.
- అలాగే ఈ సమయంలో ప్యాక్డ్ డ్రింక్స్ తాగొద్దు. ఎందుకంటే వీటిల్లో రుచిని పెంచడానికి ఎక్కువ ఉప్పును, ప్రిజర్వేటివ్స్ ను కలుపుతారు.
- ఇవి కాకుండా, మాంసం, గుడ్డు, మద్యం, పొగాకు వినియోగం కూడా నవరాత్రి సమయంలో ఖచ్చితంగా నిషేధం.
- ఉపవాసం ఉండేవాళ్లు, సంధ్య ఆర్తి లేదా సూర్యాస్తమయానికి ముందు పూర్తి భోజనం లేదా చివరి భోజనం చేయవద్దు.
- అలాగే ఈ సమయంలో ప్యాక్డ్ డ్రింక్స్ తాగొద్దు. ఎందుకంటే వీటిల్లో రుచిని పెంచడానికి ఎక్కువ ఉప్పును, ప్రిజర్వేటివ్స్ ను కలుపుతారు.