Muharram 2022: అషురా రోజున ముస్లింలు ఎందుకు ఉపవాసం ఉంటారు.. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి..

First Published Aug 8, 2022, 3:03 PM IST

Muharram 2022: అషూరా ఈ పవిత్ర నెల 10 వ రోజున వస్తుంది. ప్రవక్త ముహమ్మద్ మనుమడు ఇమాం హుస్సేన్ అమరుడైన జ్ఞాపకార్థంగా.. ముస్లింలంతా శోకసంద్రంలో మునిగిపోతారు.
 

ముహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్ అమరుడైన జ్ఞాపకార్థం.. మొహర్రం అషూరా రోజున ముస్లింలు ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది ఆగస్టు 9న మొహర్రాన్ని జరుపుకోనున్నారు. మొహర్రం 10వ రోజు లేదా ఆషూరా డే ముస్లింలకు ప్రత్యేకమైంది. 

ఇమామ్ హుస్సేన్ నాయకత్వంలోని వ్యక్తులకు .. ఉమయ్యద్ ఖలీఫా మొదటి యాజిద్ పంపిన సైన్యానికి మధ్య జరిగిన కర్బలా యుద్ధం.. క్రీ.శ 690లో మొహర్రం మాసంలో జరిగిన ముఖ్యమైన ఘటనలలో ఒకటి.
 

ఆషూరా రోజున ముస్లింలు ఉపవాసం ఉండటానికి కారణాలు 

అషూరా రోజున ఉపవాసం ఖచ్చితంగా ఉండాలన్న రూలేమీ లేదు. కానీ అల్లాహ్ దయ కోసం ముస్లింలు రెండు రోజుల పాటు ఉపవాసం ఉంటారు. అషూరా రోజున ముస్లింలు ఉపవాసం ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు ఇస్లామిక్ చరిత్రను చదివినట్లయితే.. అప్పుడు షహదత్-ఎ-ఇమామ్ హుస్సేన్ రజీ అల్లా ఉన్హాతో సహా అషూరా రోజున అనేక సంఘటనలను జరిగాయని తెలుసుకుంటారు.

అల్లాహ్ ఆషూరా రోజున ప్రవక్త ఆదాము దువాను స్వీకరించాడు. ఈ రోజున అల్లాహ్ ఇశ్రాయేలీయులను వారి శత్రువుల నుంచి రక్షించాడు.  ప్రవక్త మూసా ఈ రోజున ఉపవాసం ఉన్నారు. ఇంతేకాదు అల్లాహ్ ప్రవక్త ఇబ్రహీం ను అగ్ని నుంచి రక్షించాడు. 

ఆషూరా రోజున ఉపవాసం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆషూరా రోజులలో ఉపవాసం ఆధ్యాత్మిక విమోచనను అందిస్తుంది. మీరు చేసిన పాపాలను తుడిచే పెట్టే అవకాశాన్నిస్తుందని నమ్ముతారు. ప్రవక్త ముహమ్మద్ ఉపవాసం ఉండి.. జనాలను ఉపవాసం ఉండాలని ప్రోత్సహించిన రోజు కూడా ఇదే. 
 

అషూరా కోసం ముస్లింలు ఎప్పుడు ఉపవాసం ఉండాలి? 

అషూరా ఉపవాసం మొహర్రం 10వ రోజున వస్తుంది. ముస్లింలు ఒక రోజు ముందు, తరువాత, అంటే ముహర్రం 9వ, 11వ తేదీలలో కూడా ఉపవాసం ఉండాలని ప్రోత్సహించారు.
 

click me!