ఎండాకాలంలో గుడ్లు తినొచ్చా?

First Published | May 5, 2024, 1:31 PM IST

ఎండాకాలంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలంటారు పెద్దలు. ఎందుకంటే ఇవి ఒంట్లో వేడిని బాగా పెంచుతాయి. అయితే చాలా మంది ఎండాకాలంలో గుడ్లను అస్సలు తినరు. ఎందుకంటే ఇవి కూడా శరీర వేడిని పెంచుతాయని. అసలు ఎండాకాలంలో గుడ్లను తినాలా? వద్దా? తెలుసుకుందాం పదండి.

మన వంటగదిలో సాధారణంగా కనిపించే ఆహార పదార్థాల్లో గుడ్లు ఒకటి. గుడ్లను రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్లలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అలాగే ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. గుడ్లు సూర్యరశ్మి వాతావరణంలో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.కానీ చాలా మంది ఎండాకాలంలో గుడ్లకు దూరంగా ఉంటుంటారు. కానీ ఎండాకాలంలో గుడ్లను తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
 

eggs

ప్రోటీన్ 

గుడ్లు నాణ్యత కలిగిన ప్రోటీన్ కు మంచి వనరు. గుడ్లు మన శరీర కండరాలకు అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. కండరాల పెరుగుదల. కండర ద్రవ్యరాశిని నిర్మించడానికి, నిర్వహించడానికి, రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి, కడుపును నిండుగా ఉంచడానికి గుడ్లు ఎంతగానో సహాయపడతాయి. 


కంటి ఆరోగ్యం

ఎండాకాలంలో సూర్యరశ్మి వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సీజన్ లో కళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీంతో కంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సీజన్ లో గుడ్లను తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్లలో ఉండే లుటిన్, జియాక్సంతిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, యూవీ కిరణాల నుంచి రక్షించడానికి అవసరమైన రెండు యాంటీఆక్సిడెంట్లు.
 

గుండె ఆరోగ్యం 

గుడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. గుడ్లలో అసంతృప్త కొవ్వులు ముఖ్యంగా మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. 

eggs

ఎముకల ఆరోగ్యం 

గుడ్లు విటమిన్ డి కిమంచి మూలం.  ఇది కాల్షియం శోషణ, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలను నిర్వహించడానికి తగినంత మొత్తంలో విటమిన్ డి అవసరం. ఇది ఎముక పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. 
 

ఎముకల ఆరోగ్యం 

గుడ్లు విటమిన్ డి కిమంచి మూలం.  ఇది కాల్షియం శోషణ, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలను నిర్వహించడానికి తగినంత మొత్తంలో విటమిన్ డి అవసరం. ఇది ఎముక పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. 
 

Latest Videos

click me!