ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కున పెట్టాలో తెలుసా?

First Published | May 5, 2024, 2:19 PM IST

వాస్తు ప్రకారం.. ఏ వస్తువు ఏ దిక్కున ఉండాలో అక్కడ ఉంటేనే ఇంట్లో అంతా బాగుంటుంది. వాస్తుకు విరుద్దంగా చేస్తే చాలా సమస్యల్లో ఇరుక్కుంటామంటారు జ్యోతిష్యులు. అందుకే వాస్తు ప్రకారం.. ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కున పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Clock

గడియారం వాస్తు..

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో గడియారం ఉన్న స్థానాన్ని బట్టి మనకు మంచి జరుగుతుంది. లేదా చెడు కూడా జరగొచ్చు. వాస్తు ప్రకారం కాకుండా మనకు ఇష్టం వచ్చిన దగ్గర లేదా అందంగా ఉండాలని పెడితే మాత్రం మీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి గడియారం వాస్తు చిట్కాలను ఇప్పుడు చూద్దాం పదండి.
 

ఉత్తరం 

ఉత్తరం దిశను సంపదల దేవుడైన కుబేరుడు, వినాయకుడు పరిపాలిస్తారని పురాణాల్లో ఉంది. అందుకే మీ ఇంట్లో గడియారాన్ని ఉత్తరం దిశలో పెట్టండి. ఉత్తరం వైపు గడియారం ఉంటే మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా రావు.


దక్షిణం 

మరణానికి దేవుడైన యముడు దక్షిణాదిని పరిపాలిస్తాడని చెబుతారు. అందుకే ఈ దిశలో మాత్రం గడియారాన్ని పెట్టకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ దిశలో గడియారాన్ని పెడితే మీకు అన్నీ సమస్యలే వస్తాయి. అందుకే పొరపాటున కూడా ఈ దిశలో గడియారాన్ని పెట్టకండి. 
 

తూర్పు

తూర్పు దిశను శుభ దిశగా భావిస్తారు. ఎందుకంటే సూర్యుడు ఈ దిశనుంచే ఉదయిస్తాడు. ఉదయించే సూర్యుడికి తూర్పు దిశలో గడియారాన్ని వేలాడదీయడం వల్ల ఇంట్లోని వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. 
 

పడక గదిలో..

పడకగదిలో లోలక గడియారాలను ఉంచకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది దంపతులకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే లోలక గడియారాలను పడకగదిలో పెట్టడం వల్ల ఇంట్లోని వారి జీవితాలు ఊగిసలాటకు గురవుతాయని నమ్ముతారు. 

ఇంటి ప్రవేశ ద్వారం పైన..

ఇంటి ప్రవేశద్వారంపై కూడా గోడ గడియారాలను చాలా మంది పెడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం గడియారాలను అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఇది మీకు ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. 

Latest Videos

click me!