కేటీఆర్ జాతకంలో కారాగారవాసం ... ఏ క్షణమైనా జైలుకు..: జ్యోతిష్యుడు వేణుస్వామి 

By Arun Kumar PFirst Published May 5, 2024, 12:57 PM IST
Highlights

ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత డిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో వున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారంటూ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎక్కువగా సినిమా వాళ్ల జాతకాలు చెబుతుంటారు. స్టార్ హీరోలు, హీరోయిన్ల కెరీర్ గురించి మాత్రమే కాదు వ్యక్తిగత జీవితం గురించి జాతకం చెబుతూ నిత్యం ఏదోఒక వివాదం రాజేస్తుంటారు. అయితే తాజాగా ఆయన రాజకీయాలపై పడ్డారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం ఎవరిదో చెబుతూనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ జాతకంపై సంచలన వ్యాఖ్యలు చేసారు వేణు స్వామి.
 
కల్వకుంట్ల తారక రామారావు జాతకం ప్రకారం జైలు జీవితం గడపాల్సి వుందంటూ జ్యోతిష్యుడు వేణు స్వామి బాంబు పేల్చారు. జూన్ 21, 2025 లోపు ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ కావచ్చని ... జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. కేటిఆర్ కు ప్రస్తుతం ఏలినాటి శని వుందని... అందువల్లే ఆయనకు కష్టాలు తప్పవని వేణుస్వామి తెలిపారు. 

బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడి తన తనయుడు కేటీఆర్ ను ఓ స్థాయికి తీసుకువచ్చాడని వేణు స్వామి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్ జాతకం ఏమాత్రం బాగాలేదు... కాబట్టి తండ్రి తీసుకువచ్చిన స్థాయి నుండి ఆయన కిందకు జారిపోతున్నారని అన్నారు. ఇకపై కేటీఆర్ కు మరిన్ని కష్టాలు తప్పవన్నారు. కేటీఆర్ జాతకంలో కారాగారవాసం వుందని వేణుస్వామి స్పష్టం చేసారు. 

ఇదిలావుంటే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని వేణుస్వామి స్పష్టం చేసారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు కాంగ్రెస్ సాధిస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందనేలా వివాదాస్పద జ్యోతిష్యులు వేణుస్వామి కామెంట్స్ చేసారు. 

వేణు స్వామి చెప్పేది నిజమేనా? 

ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే వేణుస్వామి చెప్పింది నిజం అవుతుందేమో అన్న అనుమానం కలుగుతుంది. బిఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ సాగిందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సైతం అరోపిస్తున్నారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంలో కేటీఆర్ హస్తం వుందనే ఆధారాలు దొరికితే ఆయనను అరెస్ట్ తప్పదు. ఇదే విషయాన్ని జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా చెప్పారు. 

 
 


 
 

click me!