ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 నాడు క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. యేసుప్రభు పుట్టిన రోజునే క్రిస్మస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు క్రిస్టియన్లు యేసుప్రభువును ప్రార్థిస్తారు. అలాగే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఈ రోజు క్రిస్మస్ కాబట్టి.. ఫ్రెండ్స్ కు, బంధువులకు ఎలా విషెస్ చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Happy christmas..Merry christmas...
యేసుప్రభు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని, మీకు విజయాన్ని మరియు సంతోషాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.. హ్యాపీ క్రిస్మస్
యేసు ప్రభువు మీపై తన ప్రేమను కురిపించుగాక. క్రిస్మస్ శుభాకాంక్షలు!
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
మేరీ క్రిస్మస్ ! యేసుప్రభు ప్రేమ మీతో ఉండాలి.
ఈ క్రిస్మస్ సందర్భంగా.. మీకు సంపద, శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా. క్రిస్మస్ శుభాకాంక్షలు!
అద్భుతాలు మీ జీవితపు తలుపులు తట్టాలని కోరుకుంటూ.. క్రిస్మస్ శుభాకాంక్షలు!
ఈ క్రిస్మస్ మీ కలలన్నీ నిజం చేయాలి.. హ్యాపీ క్రిస్మస్
ఈ క్రిస్మస్ చిన్న చిన్న విషయాలు కూడా మీ ముఖంలో చిరునవ్వును తీసుకురావాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ శుభాకాంక్షలు! మీకు అదృష్టం, అపారమైన ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్నాను.
క్రిస్మస్ ఆనందం ఎప్పటికీ మీతోనే ఉండాలి. క్రిస్మస్ శుభాకాంక్షలు!
క్రిస్మస్ మీ జీవితంలో సరికొత్త ఆరంభానికి నాంది పలకాలి. క్రిస్మస్ శుభాకాంక్షలు!
ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు చాలా బహుమతులు పొందాలని, సంతోషకరమైన సహవాసం, మీ ప్రియమైనవారి ప్రేమ, మీ రాబోయే సంవత్సరం చాలా మెరుగ్గా ఉండాలని కోరకుంటూ.. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
శాంటా వస్తాడు.. మీ ఆశలన్నీ నెరవేరుస్తాడు.. క్రిస్మస్ శుభాకాంక్షలు