అబ్బాయిలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..!

First Published Nov 18, 2022, 2:51 PM IST

గజిబిజీ లైఫ్ కారణంగా చాలా మంది పురుషులు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మర్చిపోతున్నారు. దీనివల్ల గుండెపోటు, రక్తపోటు వంటి రోగాలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

Image: Getty Images

కొన్ని విషయాల్లో ఆడవారితో పోల్చితే.. అబ్బాయిలే ఎక్కువ బరువు, బాధ్యతలు మోస్తారు. ముఖ్యంగా ఈ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది పురుషులు తమ ఆరోగ్యం గురించి కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. దీనివల్ల గుండెపోటు, అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి, స్ట్రోక్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఆడవారితో పోల్చితే మగవారే ఎన్నో ప్రమాదకరమైన రోగాలు బలైపోతున్నారు. ఒకప్పుడు 80, 90 ఏండ్లు వచ్చినా దట్టంగా, బలంగా ఉండేవాళ్లు. ఇప్పుడు చాలా చిన్నవయసులోనే బలహీనత, అలసట వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే పురుషులు కొన్నిఆహారాలను, పానీయాలను రోజు వారి ఆహరంలో చేర్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఎన్నో జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

డ్రై ఫ్రూట్స్

పురుషుల ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్లతో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా తయారుచేస్తాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం పిస్తా, వాల్ నట్స్, బాదం, జీడిపప్పులు వంటి వాటిని రోజూ గుప్పెడు తినడం అలవాటు చేసుకోండి. 
 

గుడ్లు

గుడ్డు సంపూర్ణ ఆహారం. ఇది  ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుందన్న ముచ్చట దాదాపుగా అందరికీ ఎరుకే. అందుకే డైటీషియన్లు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తినాలి సలహానిస్తుంటారు. ఈ సూపర్ ఫుడ్ లో ఐరన్, ప్రోటీన్, విటమిన్ బి, కాల్షియం, విటమిన్ డి, లుటిన్, విటమిన్ ఎ, మెగ్నీషియం వంటి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ పురుషులను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

పండ్లు,  కూరగాయలు

పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ఇవి ఆరోగ్యకరమైన ఆహారాల లీస్ట్ లో ఉన్నాయి. పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయాడానికి సహాయపడతాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. 
 

పాల ఉత్పత్తులు

పాలు కూడా సంపూర్ణ ఆహారం జాబితాలోనే ఉంటాయి. పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. పాలు, పాల ఉత్పత్తులు శరీరాన్ని బలంగా చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. పెరుగులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు, పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

కొవ్వు చేప

ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులో గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వీటి మూలంగానే చనిపోతున్నారు. అయితే గుండె కు సంబంధించిన సమస్యలు రాకూడదంటే కొవ్వు చేపలను డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొవ్వు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

click me!