ఈ మసాలా దినుసులు ఇన్ని సమస్యలను తగ్గిస్తాయన్న ముచ్చట మీక్కూడా తెలియదు..!

First Published Aug 7, 2022, 2:26 PM IST

మసాలా దినుసులను వివిధ వంటకాల్లో వేస్తుంటాం. అయితే వీటిని ఉపయోగించి ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. 
 

ప్రపంచంలో మరే దేశాల్లో లేని సుగంధ ద్రవ్యాలు మన దేశంలో ఉత్పత్తి అవుతాయి. అందుకే ఇండియాను సుగంధ ద్రవ్యాల దేశం అని కూడా అంటారు. సుగంధ ద్రవ్యాలను వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. వీటివల్ల వంటలు రుచికరంగా అవుతాయి. అంతేకాదు ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. అందుకే వీటిని ఆయుర్వేద ముందుల్లో వీటిని ఎప్పటినుంచో ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని మసాలా దినుసులు కొన్ని అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

తలనొప్పికి

తలనొప్పి వివిధ కారణాల వస్తుంది. అయితే తలనొప్పిని చిటికెలో తగ్గించే గుణాలు అల్లంలో ఉంటాయి. ఒక కప్పు అల్లం టీ తాగితే తలనొప్పితో పాటుగా వికారం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 
 

Turmeric

కాలిన గాయాలకు

కాలిన గాయాలను మాన్పించడంలో పసుపు ఔషదంలా పనిచేస్తుంది. ఈ పద్దతిని మన తాతలు ముత్తాతల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు.  ఇందుకోసం పసుపు మెత్తగా గ్రైండ్ చేసి గాయానికి పెట్టాలి. 
 

నిద్రలేమికి

ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ సమస్యను పోగొట్టేందుకు జాజికాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం జాజికాయను గ్రైండ్ చేసి పొడిగా చేయండి. పడుకునేటప్పుడు గ్లాస్ వాటర్ లో దీన్ని కలిపి తాగండి. 

పంటినొప్పికి..

లవంగాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో ఉండే యూజెనాల్ పంటి నొప్పిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పంటి నొప్పి అనిపించినప్పుడు లవంగాను తీసుకుని పంటికింద పెట్టండి. లేదా నమలండి.

జుట్టు రాలడాన్ని ఆపడానికి..

వాతావరణ కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. కొందరికైతే బట్టతల కూడా వస్తుంది. అయితే మెంతులు జుట్టు సమస్యలను తొలగించడానికి.. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. 
 

చెడు శ్వాసకు..

కొంతమంది  నోరును ఎంత క్లీన్ చేసుకున్నా నోటినుంచి చెడు వాసన వస్తుంటుంది. అయితే ఈ సమస్యను దాల్చిన చెక్క పోగొడుతుంది. దాల్చిన చెక్కను నమలడం వల్ల నోటి నుంచి మంచి సువాసన వస్తుంది. 
 

బరువు తగ్గడానికి.. 

ఈ రోజుల్లో అతి కష్టమైన సమస్య ఏదైనా ఉందా అంటే అది బరువు తగ్గడమే అని చెప్పాలి. జిమ్ములకుు వెళ్లి.. చెమటలు చిందించినా  ఆఫ్ కేజీ కూడా బరువు తగ్గనివారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికి జీలకర్ర ప్రయోజనకరంగా ఉంటుంది.  ఒకగ్లాస్ వాటర్ లో కొన్ని జీలకర్ర గింజలను వేసి నానబెట్టి.. ఉదయం వడకట్టి తాగితే వేగంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ వాటర్ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. 

click me!