అక్షయ తృతీయకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏదైనా శుభకార్యం తలపెడితే కూడా..శుభం జరుగుతుందని నమ్ముతుంటారు. అంతేకాదు... చాలా మంది ఈ రోజున ఇంట్లోకి చాలా రకాల వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.దానితో పాటు.. పలు వస్తువులు కూడా ఈ రోజు కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని నమ్ముతారు. ఇదంతా మంచి విషయమే కానీ.. కొందరు తెలియక ఏవేవో వస్తువులు కొంటారు. పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదు. అవి ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తాయట. అవేంటో చూద్దాం...
అక్షయ తృతీయ నాడు పరశురాముడు జన్మించాడు. ఇదే రోజున వేద వ్యాస్ మహాభారతాన్ని రాయడం ప్రారంభించాడు. అందుకే.. ఈరోజుని చాలా పవిత్రమైనది గా భావిస్తారరు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి, లక్ష్మీదేవిని పూజించి.. ఎవరికైనా మీకు నచ్చినది దానం చేస్తే సరిపోతుంది. ఈ ప్రత్యేకమైన రోజున మర్రి చెట్టుకు పూజించాలి. ఈ మంచి పనులతో పాటు చేయకూడని పొరపాట్లు కూడా తెలుసుకోవాలి.
ఈ రోజున బంగారం, వెండి కొనలేం కదా అని కొందరు అల్యూమినియం పాత్రలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే.. ఆ పొరపాటు మాత్రం చేయకండి. ఈ రోజున అల్యూమినియం పాత్రలు కొనడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని, ఆ వ్యక్తికి అశుభ ఫలితాలు రావడం మొదలవుతుందని చెబుతారు.
అక్షయ తృతీయ నాడు నలుపు రంగు బట్టలు కొనకండి.
అక్షయ తృతీయ రోజున నలుపు రంగు బట్టలు కొనకూడదు. నలుపు రంగు ప్రతికూల శక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని, అక్షయ తృతీయ రోజు చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి, ఈ మాసంలో నలుపు రంగు దుస్తులు ధరించడం మానుకోవాలి.
అక్షయ తృతీయ నాడు నలుపు రంగు వస్తువులను కొనకండి.
అక్షయ తృతీయ రోజున నలుపు రంగు వస్తువులను కొనడం మానుకోవాలి. మీరు నలుపు రంగు వస్తువును కొనుగోలు చేస్తే, స్థానికులు అశుభ ఫలితాలు పొందవచ్చని చెబుతారు. దీనితో పాటు గ్రహ దోషాలు కూడా తలెత్తుతాయి.
అక్షయ తృతీయ నాడు పదునైన వస్తువులను కొనకండి.
అక్షయ తృతీయ రోజున కత్తులు, కత్తెరలు, సూదులు వంటి ముళ్ల వస్తువులు కొనడం వల్ల మనసులో ప్రతికూలత వస్తుంది. అలాగే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించడు. ఇవి మాత్రమే కాదు.. అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ వస్తువులు కూడా కొనుగోలు చేయడం మంచిది కాదు. వీటి వల్ల కూడా నష్టం తప్ప.. ప్రయోజనం ఉండదు.