jr ntr luxury lifestyle: జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్ స్టైల్.. చూస్తే మతి పోవాల్సిందే..!

First Published May 20, 2022, 9:51 AM IST

jr ntr luxury lifestyle: తారక్, జూనియర్ ఎన్టీఆర్,  నందమూరి తారక రామారావు.. పేరు ఏదైనా.. తన పాపులారిటీని మాత్రం నలుమూలలా విస్తరిస్తూనే ఉన్నాడు. అందులోనూ ఈ హీరో నటుడు, రాజకీయనాయకుడైన నందమూరి తారక రామారావు మనవడాయే. 
 

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక స్థానముంది. అందులోనూ ఈ హీరోకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. పాత్ర ఏదైనా.. నటనలో మాత్రం తగ్గేదేలే అన్నట్టు యాక్టింగ్ చేస్తుంటారు ఈ యమదొంగ. ఎంతటి భారీ డైలాగ్ అయినా సరే ఎక్కడా తడబాటు, తత్తర పాటు లేకుండా.. నాన్ స్టాప్ గా మాట్లాడగల వాక్ చాతుర్యం గలవాడు. ఈ హీరోకు అసలు రానిదంటూ ఏదీ ఉండదమో అనడంలో ఎలాంటి సందేహం లేదు కదా. అందులోనూ మన హీరో నటనకు ప్రతిరూపంగా నిలిచే నందమూరి తారక రామారావు మనవడు. అందుకేనేమో.. నటనలో తనకు తానే సాటిగా నిలుస్తున్నారు. ఇంతకీ ఈ రోజు మన హీరో పుట్టిన రోజు కూడా. మరి విష్ చేశారా లేదా? 

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సినీ రంగ ప్రవేశం, ఆయన రెమ్యూనరేషన్ వంటి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పదండి.  

20 మే 1983 లో హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ జన్మించారు. ఈయన ఆంధ్రప్రరదేశ్ మాజీ సీఎం, అద్భుత నటుడు ఎన్.టి, రామారావు మనువడు. 

స్టూడెంట్ నెం1 సెట్స్ లో రాజమౌళితో కలసి..

2001 లో ‘స్టూడెంట్ నెం.1’ లో తన సినీ కెరియర్ ను ప్రారంభించాడు. ఇంతకు ముందు బాలనటుడిగా ‘బాల రామాయణము’ సినిమాలో నటించాడు కూడా. 

ఇక రీసెంట్ గా రిలీజై రికార్డులు బ్రేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తన పాత్ర కోసం ఈ కుర్ర హీరో ఏకంగా రూ.45 కోట్లను వసూలు చేసినట్టు సమాచారం. 

ఇక సినిమాల్లో ఈయన నటనకు పిచ్చపాటి ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ఈయన ఎన్నో సినిమాలకు బెస్ట్ యాక్టర్ గా అవార్డులు కూడా కైవసం చేసుకున్నారు. నటనతో పాటుగా ఈయన కారు నంబర్లు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. 

జూనియర్ ఎన్టీఆర్ 9999 ను తన లక్కీ నంబర్ గా భావిస్తాడు. అందుకే తను కొన్న లగ్జరీ కార్లాలో చాలా వరకు ఒకే సంఖ్యలో ఉంటాయి.  తన లక్కీ నంబర్ అయిన 9999 కోసం బిఎమ్ డబ్ల్యూ రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా 11 లక్షల వేలం వేశాడు ఈ నందమూరి కుర్ర హీరో. 
 

ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ లగ్జరీ ఇంట్లో నివసిస్తున్నాడు. ఆ ఇంటి విలువ ఏకంగా రూ.25 కోట్లు ఉంటుంది. 

జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సౌత్ వెర్షనన్ మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించి అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇక బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించినందుకు గానూ ఈయన ఏకంగా రూ.25 కోట్లు వసూలు చేశారు. 

click me!