కానీ పటాస్ చేసింది కళ్యాణ్ రామ్. నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి అంత మంచి సూపర్ హిట్ దక్కినందుకు నేను హ్యాపీ. ఆయన ఛాన్స్ ఇవ్వకపోతే.. సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లాంటి చిత్రాలు చేసేవాడిని కాదు. నా కథని ఆయన నమ్మారు. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయినా సరే నేనే ఈ చిత్రాన్ని నిర్మిస్తాను అని మాట ఇచ్చారు.