మామిడి తొక్కను పారేస్తున్నారా? దీనిలో ఏమేమి చేయొచ్చో తెలుసా?

First Published May 17, 2024, 1:43 PM IST

చాలా మంది మామిడి పండ్ల గుజ్జును తినేసి దాని తొక్కను డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ ఈ మామిడి తొక్కలు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. అసలు ఈ తొక్కలతో ఏమేమి చేయొచ్చంటే? 

ఎండాకాలంలో మామిడి పండ్లను తింటే వచ్చే మజా దేనిలోనూ రాదు. అందులోనూ ఈ పండ్లు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. అయితే మనలో ప్రతి ఒక్కరూ కేవలం మామిడిపండ్లను తిని అంటే లోపలి గుజ్జును మాత్రమే తిని తొక్కను మాత్రం పారేస్తుంటారు.  ఎందుకంటే ఇవి మనకు ఏవిధంగా పనికిరావని. నిజమేంటంటే? మామిడి తొక్కలు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగడతాయి. అసలు మామిడి తొక్కలను దేని దేనికి ఉపయోగించొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఎరువు 

మామిడి తొక్కలతో ఎరువును తయారుచేయొచ్చు. ఇది మొక్కలు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే మామిడి తొక్కలను తీసుకుని, వాడిన టీ ఆకులతో కలిపి ఒక కుండలో వేయండి. దీనిలో కొద్దిగా మట్టి వేయండి. కొన్ని రోజుల్లోనే ఇది ఎరువుగా మారుతుంది. 
 

Latest Videos


మామిడి తొక్క టీ తాగండి

మామిడి తొక్కలతో కూడా మీరు టీని తయారుచేసి తాగొచ్చు. ఈ టీ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. ఈ మామిడి తొక్కల టీ మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
 

ముడతల నుంచి ఉపశమనం 

పనికి రావనుకునే మామిడి తొక్కలతో చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవును మామిడి తొక్కలతో ముఖంపై ఉన్న ముడతలను పోగొట్టొచ్చు. ఇందుకోసం మామిడి తొక్కలను మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి కనీసం 15 నిమిషాలైనా అలాగే ఉండండి. ఇది ఆరిన తర్వాత ముఖాన్ని నార్మల్ వాటర్ తో కడిగేయండి.  దీనివల్ల చర్మం బిగుసుకుపోతుంది.
 

చర్మశుద్ధి

మామిడి కాయ తొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి స్కిన్ టానింగ్ ను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఈ తొక్కలను పెరుగుతో గ్రైండ్ చేసి ముఖానికి, అన్ని టాన్ భాగాలకు అప్లై చేయండి. ఇది చర్మశుద్ధిని తగ్గిస్తుంది.
 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణ సమస్యలున్నవారికి కూడా మామిడి కాయ తొక్కలు బాగా ఉపయోగపడతాయి. మీకు జీర్ణ సమస్యలు ఉంటే  మామిడి తొక్కలను నమలండి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 
 

click me!