అమ్మాయిల వివాహ వయసు పెంచడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?

First Published Jan 4, 2022, 2:55 PM IST

అమ్మాయికి యుక్తవయసు రాగానే 18 ఏళ్ళు నిండిన తర్వాత వివాహం (Marriage) చేయవచ్చని  ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల పెళ్లి వయస్సు 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచింది. ఇలా అమ్మాయిల పెళ్లి వయసు పొడిగించడానికి గల ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

అమ్మాయిల పెళ్లి వయసు పొడిగించాలని బాల్య వివాహాల నియంత్రణ చట్టం (Child Marriage Control Act), స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (Special Marriage Act), హిందూ మ్యారేజ్ యాక్టులలో సవరణలు చేయాలని భావించి బుధవారం నాడు డిసెంబర్ 16వ తేదీన ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీంతో అమ్మాయిల కనీస వయస్సు 18 నుండి 21 సంవత్సరాలకు పెరిగింది.
 

ఇందుకోసం జయా జైట్లీ (Jaya Jaitley) సారథ్యంలో నీతి అయోగ్ టాస్క్ ఫోర్స్ Nithi (Ayog Task Force) ను కమిటీని కూడా నియమించింది. అయితే ఇలా అకస్మాత్తుగా కేంద్రం అమ్మాయిల పెళ్లి వయసు పొడిగించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన దేశంలో చాలా ప్రాంతాలలో అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండి నిండకముందే పెళ్లిళ్లు చేస్తున్నారు.
 

ఇలా అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని పెద్ద బాధ్యతలను (Responsibilities) స్వీకరిస్తున్నారు. ఏమీ తెలియని అమాయకత్వం, ఎదిగి ఎదగని మనస్తత్వం పెళ్లి తర్వాత వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిన్న వయసులోనే గర్భం (Pregnancy) రావడం, వారి శరీరం అందుకు సహకరించకపోవడం, గర్భస్రావాలు అధికంగా జరగడం వంటి సమస్యలతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
 

దీని ప్రభావం వారితోపాటు కడుపులోని బిడ్డ మీద కూడా పడుతోంది. ఇలా పుట్టబోయే పిల్లలకు కూడ అనారోగ్య సమస్యలు (Illness issues)  తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటాయని భావించి టాస్క్ ఫోర్స్ టీం లోని ప్రభుత్వ నిపుణులు వీకే పాల్, వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి, మహిళా శిశు సంక్షేమ శాఖ (Department of Women and Child Welfare) ఒక అభిప్రాయానికి వచ్చారు.
 

ఇందుకోసం అమ్మాయిల పెళ్లి వయసు పొడిగించడంపై ప్రభుత్వం ఒక సర్వే (Survey) చేపట్టింది. అమ్మాయిలకు పెళ్లి వయసు పొడిగించడంపై  సరైన స్పష్టత (Clarity) ఉందని వారు దీనికి ఏకీభవిస్తున్నాను అని తేలింది. దాంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయడానికి నిర్ణయించుకుంది. అమ్మాయిల పెళ్లి వయస్సు 21 పెంచడంతో అమ్మాయిలలో వివాహం పట్ల మానసిక స్థితి మెరుగుపడుతుందట.
 

వారు ఏ నిర్ణయమైనా స్పష్టంగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తారని, వారికి అన్ని విషయాలపై సరైన అవగాహన (Awareness) ఉంటుందని ప్రభుత్వం ఆలోచించింది. అమ్మాయిల ఆరోగ్యంతోపాటు (Health) వారి వివాహ జీవితం బాగుండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కొందరు ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిని తెలియజేస్తున్నారు. పల్లెలు, గ్రామాలలోని పెద్దలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా అమ్మాయిలకు తొందరగా వివాహం చేసి వారిని ఒక ఇంటివారిని చేయడం మంచిదని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

click me!