International Cat Day: పిల్లుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం..

First Published Aug 8, 2022, 4:49 PM IST

International Cat Day: ఈ రోజు ప్రపంచ పిల్లుల దినోత్సవం. మరి ఈ సందర్బంగా పిల్లుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం పదండి.. 
 

పిల్లులు చాలా స్వార్థపూరితమైనవి. వీటి బాడీ చాలా చల్లగా ఉంటుంది. ఈ పిల్లులు కొందరికి అస్సలు నచ్చవు. మీకో విషయం తెలుసా.. ఈ జిప్టుల సంస్కృతిలో పిల్లలను బాగా గౌరవించేవాళ్లు.
 

9,500 సంవత్సరాల క్రితం అతిపెద్ద పిల్లి ఉందన్న ముచ్చట మీకు తెలుసా.. దీనిని ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తలు 2004 లో సైప్రస్ లో ఒక సమాధిని కనుగొన్నప్పుడు గుర్తించారు. 
 

పిల్లలకు నిద్రంటే చాలా ఇష్టం. ఇవి రోజులో 70 శాతం నిద్రలోనే గడుపుతాయి. అంటే పిల్లులు రోజుకు 13 నుంచి 16 గంటలు నిద్రలోనే ఉంటాయన్న మాట.
 

ప్రపంచంలో అత్యంత ధనిక పిల్లి ఉందన్న సంగతి మీకు తెలుసా.. ఈ పిల్లికి ఒకటి కాదు రెండు కాదు 7 మిలియన్ పౌండ్ల సంపద ఉంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం దీని పేరు బ్లాకీ.. 
 

cat

ఇంటి పిల్లి 30  mph వేగంతో పరిగెత్తగలవు. అలాగే పిల్లులు వాటి పొడవు కంటే ఆరు రెట్లు పైకి దూకగలవు. వీటి పంజాలు కిందికి వంగి ఉంటాయి. 

cat

మనిషి శరీరంలో 206 ఎముకలు ఉంటే.. పిల్లుల్లో మాత్రం 230 ఎముకలు ఉంటాయి. పిల్లులకు మాత్రమే ఉండే అదనపు అవయవం గాలిపై సువాసనను చూడటానికి ఉపయోగపడుతుంది. 

cat

చాలా పెంపుడు పిల్లులు నీటిని అస్సలు ఇష్టపడవు. ఇది లొకేషన్, ఇన్సులేషన్ ప్రాసెస్ రెండింటిపైనా ఆధారపడి ఉంటుంది. పిల్లి చల్లని ప్రదేశంలో నివసిస్తుంది. కానీ నీరు దానికి నచ్చదు. చల్లని ప్లేస్ లో ఉండే పిల్లల చర్మం చదరపు అంగుళానికి 1,20,000 వెంట్రుకలు ఉంటాయి. 

మన పెంపుడు పిల్లి యొక్క డిఎన్ఎలో 96% పులి మాదిరిగానే ఉంటుంది. పిల్లులు చలిలో మంట పక్కన కూర్చోవడానికి ఇష్టపడతాయి. పిల్లులు 50 డిగ్రీల సెల్సియస్ వరకు సౌకర్యవంతంగా జీవించగలవు.

ఐరోపాలో దేశీయ పిల్లులు కేవలం ఒక సంవత్సరంలో 40 మిలియన్ల ఎలుకలను చంపుతాయి. పిల్లులు సుమారు 1,000 రకాల ధ్వనులను చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ కుక్కలు కేవలం 10 రకాల ధ్వనులను మాత్రమే చేయగలవు. 

పిల్లి వెంట్రుకలు ఎరను దగ్గరి నుండి పట్టుకోవడానికి సహాయపడతాయి. పిల్లులు స్వీట్లను పెద్దగా ఇష్టపడవు. ఎందుకంటే వాటికి స్వీట్ల రుచి తెలియదు. పెంపుడు పిల్లులు నీటిని ద్వేషిస్తాయి. అందుకే అవి స్నానం చేసేటప్పుడు వేర్వేరు శబ్దాలు చేస్తాయి.

click me!