Sneezing: తరచుగా వచ్చే తుమ్ములను ఆపే చిట్కాలివే..

First Published Jan 15, 2022, 1:10 PM IST

Sneezing: సీజనల్ గా వచ్చే దగ్గు, జ్వరం, జలుబు ల పట్ల ప్రత్యేక కేరింగ్ తప్పనిసరి. ఎందుకంటే సీజనల్ వ్యాధులు సర్వసాధారణం అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందులోనూ వీటిని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలంటే...

శీతాకాలంలో సర్వసాధారణంగా జ్వరం, జలుబు, దగ్గు లాంటి సమస్యలు తరచుగా ఎదురవుతుంటాయి. వీటితో పాటుగా వైరస్, ఫ్లూ వంటి వ్యాధులు కూడా సీజనల్ గా సోకుతుంటాయి. ఈ సమస్యలన్నీ ఎక్కువగా చలికాలంలోనే అటాక్ చేస్తుంటాయి. జలుబుతో పాటుగా విరామం లేకుండా, తరచుగా తుమ్ముల సమస్య అధికంగా వేధిస్తుంటుంది. కొందరు ఈ తుమ్ముల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోకున్నా.. కొందరికి ఈ తుమ్ములు(Sneezing)చికాకును, ఇబ్బందిని కలిగిస్తుంటాయి. తరచుగా తుమ్మడం వల్ల పనిపై ఉన్న ఇంట్రెస్ట్ ను పూర్తిగా కోల్పోయి  ఆందోళనకు, మనస్తాపానికి లోనవుతుంటారు. దీనికి తోడు Headache బారిన కూడా పడుతుంటారు.

 దీనికి సైనస్ కూడా ఒక కారణం అని వైద్యులు వెళ్లడిస్తున్నారు. అయితే ఈ తుమ్ములు ఎందుకు  తరచుగా వస్తాయంటే.. ముక్కులో ఉండే ఎముక పెరగడం వల్ల తుమ్ములు, జలుబు చేస్తుందని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. అందులోనూ సైనస్ కారణంగానే జలుబు చేస్తుంది. శస్త్ర చికిత్స ద్వారా ఈ సమస్య ను సులభంగా వదిలించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. కానీ చాలా మంది  Medicine ద్వారానే ఈ సమస్యను తగ్గించుకోవాలని భావిస్తారు. ఇలా  Medicine వాడటం వల్ల జలుబు తగ్గుతుంది. కానీ వీటి వాడకం వల్ల శరీరం పై హానికరమైన ప్రభావం పడుతుంది. అందుకే మెడిసిన్ కు బదులుగా ఇంట్లో లభించే వాటితోనే ఈజీగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దాని కోసం ఏం చేయాలో తెలుసుకుందాం పదండి..

తుమ్ములు ఎక్కువగా ఎలర్జీలు ఉన్నావారికే ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వారు వేడిని నీటిని తాగడం ఉత్తమం. వేడి నీరు తాగడం వల్ల body కొంచెం వేడి గా అవుతుంది. దాంతో తుమ్ములు, జలుబు సమస్య నుంచి కొంచెం వరకు ఉపశమనం పొందవచ్చు. వేడినీళ్లను తాగితే ఉదర సంబంధ సమస్యలు కూడా రావని నిపుణులు వెళ్లడిస్తున్నారు. 

ఉప్పు నీళ్లు తుమ్ముల నుంచి ఉపశమనం కలిగించడంలో ముందుంటాయి. తుమ్ములు తరచుగా వేధిస్తుంటే.. వారు ఉప్పు నీళ్లను తాగితే తొందరగా ఈ బాధ నుంచి బయటపడొచ్చు. అయితే ఉప్పునీటిని తాగడం కష్టంగా భావిస్తే నోటిలో కొద్ది సేపు ఉంచి పుక్కిలించినా ప్రయోజనం ఉంటుంది. కొన్ని రోజుల పాటు ఇలాగే చేస్తే ఈసమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.
 

ఆవిరి పట్టడం వల్ల కూడా తుమ్ముల బారీ నుంచి తప్పిచుకోవచ్చు. వేడి నీటి ఆవిరి పడితే జలుబు, తుమ్ములు Automatic గా తగ్గుతాయి. అలాగే వేడి నీటి ఆవిరి వల్ల ముఖంపై ఉండే మురికి కూడా వదులుతుంది. దాంతో మీ ముఖం తళతళ మెరిసిపోతుంది. తుమ్ముల సమస్య విపరీతంగా ఉన్నట్టైతే రోజుకు ఒక సారి ఆవిరి పడితే ఈ  సమస్య నుంచి గట్టెక్కొచ్చని నిపుణులు వెళ్లడిస్తున్నారు. 
 


అలర్జీ సమస్య ఉన్న ఉన్న వారికి నల్ల మిరియాలు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. వీటిని ఎలా ఉపయోగించాలంటే నల్ల మిరియాలు కొన్నింటిని తీసుకుని వాటిని పౌడర్ లా చేయాలి. ఆ పొడిని కొన్ని తులసి ఆకులతో కలిపి నమిలితే మంచి ఫలితం వస్తుంది. వీటితో టీ కూడా తయారుచేసుకుని తాగొచ్చు. ఏండ్ల కిందటి నుంచి ఈ నల్ల మిరియాలను అనేక రోగాల నయం కోసం ఉపయోగిస్తున్నారు. 
 

click me!