మీ పిల్లలు స్మార్ట్ ఫోన్, టీవీ ఎక్కువగా చూస్తున్నారా అయితే వారిలో ఈ రోగాలు వచ్చే అవకాశం?

First Published Dec 1, 2021, 4:47 PM IST

ప్రస్తుతకాలంలో అందరి ఇంట్లో టీవీలు(Tv), స్మార్ట్ ఫోన్ ల (Smart phones) కుటుంబ సభ్యులలో ఒకరిగా మారిపోయాయి. టెక్నాలజీ పెరగడంతో ధనిక, పేద అనే భేదం లేకుండా అందరి ఇంటిలో స్మార్ట్ ఫోన్, టీవీల వాడకం పెరిగిపోయింది. ఇలా వీటిని ఎక్కువగా వాడడంతో ముఖ్యంగా పిల్లలపై వీటి దుష్ప్రభావం (Side effect) ఎక్కువగా ఉంటుంది. వారి బంగారు భవిష్యత్తును నాశనం అవ్వడం తో పాటు వారి అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఎక్కువగా పిల్లలు స్మార్ట్ఫోన్లు టీవీలను చూడటం తో కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం..
 

ప్రతి ఒక్కరి ఇంటిలోనూ వీటి వాడకం (Uses) పెరిగిపోతోంది. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్ ఫోన్ లకు, టీవీలకు ఎక్కువగా అట్రాక్ట్ (Attract) అయిపోతున్నారు. వీరిలా అట్రాక్ట్ కావడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. పిల్లలు సరిగా అన్నం తినడం లేదని వారికి స్మార్ట్ ఫోన్, టీవీలను చూపించి అన్నం తినడానికి ప్రయత్నిస్తుంటారు. పిల్లలు వీటికి అలవాటు కావడంతో ఫోన్ చూపిస్తే కాని అన్నం తినమని మారం చేస్తారు.
 

పెద్దలు చేసేదేమీలేక వారికి ఫోన్ (Phone) ఇస్తుంటారు. ఇలా చేయడంతో పిల్లలలో అనేక ఆరోగ్య సమస్యలకు (Health problems) దారితీస్తుంది.
ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్, టీవీల ముందు సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. పక్కన ఏమి జరుగుతున్న పట్టించుకోరు వారి లోకంలో వారు మునిగిపోతారు. ఒకే ప్రదేశంలో కదలకుండా గంటలకొద్దీ అలాగే కదలకుండా ఉంటారు.

ఇలా ఉండడంతో పిల్లలు అధిక బరువుకు (Overweight) గురి అవుతారు. గంటల తరబడి స్మార్ట్ ఫోన్, టీవీలను చూడడంతో కంటి చూపు దెబ్బతింటుంది. వారు ఇతరులతో కలవడానికి ప్రయత్నించారు. పిల్లలలో మొండితనం (Stubbornness) పెరిగిపోతుంది. పెద్దలు చెప్పిన మాట వినరు. స్మార్ట్ ఫోన్, టీవీలో ముందే వారి సమయం గడిచిపోతుంది. టీవీలో ప్రోగ్రాంలను, స్మార్ట్ ఫోన్ లో కార్టూన్స్ (Cartoons) చూస్తూ అన్నం తింటారు.
 

ఇలా తినడంతో వారు ఎంత తింటున్నారో వారికే తెలియదు. ఇలా పిల్లలు ఎక్కువ సమయం టీవీ, స్మార్ట్ ఫోన్ ల ముందర గడపడంతో వారి బాల్య జీవితంలో (Childhood life) ఆడవలసిన ఆటలను కోల్పోతున్నారు. బయట ప్రపంచాన్ని (World) ఆస్వాదించడానికి ఇష్టపడరు. టివి లను, ఫోన్ లను ఎక్కువగా చూడడంతో వాటిలో వచ్చే పాత్రలకు ఆకర్షితులై వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.
 

వీటి వాడకం పిల్లల బంగారు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (Health Organization) హెచ్చరిస్తోంది. నిరంతరం టీవీ ముందు కూర్చునే పిల్లలు తమకు తెలియకుండానే ఏదో ఒకటి తింటూ ఉంటారని, కదలకుండా అలాగే తినడంతో లేనిపోని రోగాలు (Diseases) వస్తాయని ఆరోగ్య సంస్థ చెబుతోంది. ముఖ్యంగా పదేళ్లలోపు పిల్లలు గంట సేపు కంటే ఎక్కువగా టీవీ, స్మార్ట్‌ఫోన్ చూస్తే ఊబకాయం, హైపర్ టెన్షన్, అధిక బరువు, హింసాత్మక ధోరణులు, మధుమేహం, హృద్రోగాలు వస్తాయని హెచ్చరించింది.
 

వీటి నుంచి దూరంగా ఉంచడానికి పిల్లలతో తల్లిదండ్రులు (Parents) ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. వారిని సరదాగా బయటకు, పార్కులకు (Park) తీసుకెళ్తూండాలి. పిల్లలతో కలిసి ఆడుకునేలా చేయాలి.

click me!