టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోలు చాలామంది ఉన్నారు. సినిమా కోసం ఎంత రిస్క్ తీసుకోవడానికి అయినా వారు వెనకాడరు. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినా.. తన కష్టంతో స్టార్ గా ఎదిగాడు. నటన, డాన్స్,యాక్షన్ ఇలా ఏక్యాటగిరీ అయినా.. నవరసాలు పండించడం తారక్ కు వెన్నెతో పెట్టిన విద్య. అందుకే ఎటుంటి పాత్రలు అయినా అవలీలగా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు ఎన్టీఆర్.