నిమ్మకాయే కాదు.. దానితొక్క కూడా బరువును తగ్గిస్తుంది తెలుసా..?

First Published Nov 8, 2022, 2:47 PM IST

చాలా మంది బరువు తగ్గడానికి నిమ్మకాయలను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. నిమ్మరసంతో పాటుగా.. నిమ్మతొక్క కూడా బరువును తగ్గిస్తుందన్న ముచ్చట. 

ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య మరీ ఎక్కువైపోయింది. ఇక ఈ బరువును తగ్గించడానికి ఎన్నో.. ఎన్నో చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఓవర్ వెయిట్ ను తగ్గించడంలో నిమ్మకాయ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందన్న ముచ్చట దాదాపుగా అందరికీ ఎరుకే. అందుకే  దీన్ని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుంటారు. నిమ్మ ఒక్క బరువును తగ్గించడమే కాదు ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. అందుకే దీనిని కాలాలతో సంబంధం లేకుండా తీసుకోవాలని డాక్టర్లు చెప్తుంటారు. 

సాధారణంగా చాలా మంది నిమ్మకాయ నుంచి రసాన్ని పిండేసి.. తొక్కలు అవసరం లేదని డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. నిజమేంటంటే.. నిమ్మ రసంతో పాటుగా నిమ్మ తొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఈ తొక్కల్లో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ తొక్కల్లో డి-లిమోనేన్ అనే మూలకం కూడా ఉంటుంది. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ తొక్కను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. బరువు తగ్గడానికి నిమ్మకాయ తొక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

lemon peel

నిమ్మతొక్కలో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే.. వెంటనే తగ్గిపోతుంది. మన శరీరంలో కొవ్వు పెరిగిపోతే.. దీని మూలంగా టాక్సిన్స్ కూడా పెరిగిపోతాయి. ఇలాంటి సమయంలో నిమ్మతొక్కలను తినడం వల్ల టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అంతేకాదు దీనిలో ఉండే  విటమిన్ సి కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. 

lemon peel

నిమ్మతొక్కలో విటమిన్ విటమిన్ సి తో పాటుగా ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. నిమ్మతొక్కలను ఉపయోగించడానికి.. ముందుగా నిమ్మతొక్కలను బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి పౌడర్ లా చేసుకోండి. దీనిని గాలి వెళ్లని కంటైనర్ లో నిల్వ చేయండి. ఈ పొడిని గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగొచ్చు. 

బరువు తగ్గేందుకు నిమ్మరసంతో వివిధ రకాల పానీయాలను తయారుచేసుకుని తాగొచ్చు. ఇందుకోసం.. నిమ్మతొక్కలను తీసుకుని.. రెండు లీటర్ల నీటిలో వేసి సుమారు అర్థగంట పాటు బాగా మరిగించండి. ఇవి గోరువెచ్చగా అయిన తర్వాత తాగండి. ప్రతిరోజూ ఈ పానీయాన్నితాగితే మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. 

click me!