పిల్లలకు బెడ్ టైమ్ అలవాటు చేసేదెలా..?

First Published May 6, 2024, 1:23 PM IST

రోజూ ఒకే టైమ్ కి నిద్రపుచ్చడం కష్టంగా ఉందని.. మేం పడుకునే వరకు లేచి ఉంటున్నారు అని చాలా కంప్లైంట్స్ చెబుతూ ఉంటారు. అయితే.. ఈ కింది ట్రిక్స్ మీరు ఫాలో అయితే.. పిల్లలకు మంచి నిద్ర అందించడంతో పాటు... వారికి ఒక పర్టిక్యూలర్ బెడ్ టైమ్ కూడా అలవాటు అవుతుంది. 

పిల్లలకు నిద్ర అనేది చాలా ముఖ్యం. మనం వారికి అందించే ఆహారం వల్ల వారిలో ఎంత ఎదుగుదల ఉంటుందో.... నిద్ర వల్ల కూడా వారిలో అంతే గ్రోత్ ఉంటుంది. పిల్లల ఎదుగుదల ఎక్కువగా నిద్ర మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే... వారికి రోజులో 10 నుంచి 13 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.  అదే స్కూల్ కి వెళ్లే పిల్లలు అయితే 9-11 గంటల నిద్ర అవసరం.  అది కూడా.. రోజూ ఒకే సమాయానికి పడుకోపెట్టడం వల్ల.. వారికి నిద్ర బాగా సరిపోతుంది.
 

కానీ... చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలు ఎంత పడుకోపెట్టినా పడుకోవడం లేదని... రోజూ ఒకే టైమ్ కి నిద్రపుచ్చడం కష్టంగా ఉందని.. మేం పడుకునే వరకు లేచి ఉంటున్నారు అని చాలా కంప్లైంట్స్ చెబుతూ ఉంటారు. అయితే.. ఈ కింది ట్రిక్స్ మీరు ఫాలో అయితే.. పిల్లలకు మంచి నిద్ర అందించడంతో పాటు... వారికి ఒక పర్టిక్యూలర్ బెడ్ టైమ్ కూడా అలవాటు అవుతుంది. 

sleep

sleep
పిల్లలు రోజంతా  ఎలా ఉన్నా.. నిద్రపోయే సమయానికి ముందు వారి బాడీని, మైండ్ ని రిలాక్సింగ్ గా మార్చాలి.  అలాంటి యాక్టివిటీస్ చేయించాలి. అంటే... వారికి నచ్చిన బుక్ చదివించడం, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, సున్నితమైన యోగాసనాలు, బ్రీతింగ్ వ్యాయామాలు చేయించడం చేయాలి. టీవీ లాంటివి వీలైనంత వరకు చూడకుండా  ఉండనివ్వాలి. ఎందుకంటే.. పడుకునే ముందు టీవీలు చూస్తే.. వాటి నుంచి వచ్చే బ్లూ రేస్... నిద్రను నియంత్రించే హార్మోన్ ని విడుదల చేస్తాయి. అందుకే..పడుకునే ముందు టీవీ చూడనివ్వకూడదు.


చిన్న పిల్లలు వారి నిద్రవేళ దినచర్యను అర్థం చేసుకోవడానికి , అనుసరించడానికి విజువల్ ఎయిడ్స్ గొప్ప మార్గం. అంటే... నిద్రపోయే సమయంలో నైట్ డ్రెస్ వేసుకోవడం, బ్రష్ చేయడం  వంటి రొటీన్‌లోని ప్రతి దశను వర్ణించే చిత్రాలు లేదా డ్రాయింగ్‌లతో సరళమైన నిద్రవేళ రొటీన్ చార్ట్‌ను సృష్టించండి. చార్ట్‌ను  పిల్లలకు కనిపించేలా వాళ్ల బెడ్ రూమ్ లో అంటించండి.
 

Sleeping

మీ పిల్లలు సాయంత్రం పూట ఏమి తింటారు , త్రాగితే వారు నిద్రపోయే సామర్థ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. నిద్రవేళకు దగ్గరగా మీ పిల్లలకు షుగర్ ఉండే స్వీట్స్, జ్యూస్, చాక్లెట్స్, లాంటివి ఏమీ ఇవ్వకూడదు. వాటికి దూరంగా ఉంచితే.. పిల్లలు టైమ్ కి నిద్రపోతారు,


అంతేకాదు.. పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే వారికి మంచి కంఫర్టబుల్  బెడ్ ఇవ్వాలి. అందుకు తగినట్లుగా సౌకర్యాలని వారికి కల్పించాలి. అప్పుడు చక్కగా నిద్రపోతారు. 

click me!