మేథీ టీ.. మైండ్ బ్లోయింగ్ హెల్త్ బెనిఫిట్స్...ట్రై చేయండి..

First Published Jul 6, 2021, 2:07 PM IST

ఆరోగ్యంగా ఉండడానికి, బరువు తగ్గడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే దీనికి చక్కటి పరిష్కారం మీ వంటింట్లోనే ఉందన్న విషయం మీకు తెలుసా? 

ఆరోగ్యంగా ఉండడానికి, బరువు తగ్గడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే దీనికి చక్కటి పరిష్కారం మీ వంటింట్లోనే ఉందన్న విషయం మీకు తెలుసా?
undefined
అదేంటంటే.. మెంతులు.. పచ్చళ్లు, మసాలా వంటకాలకు మంచి ఫ్లేవర్ ఇచ్చే ఈ మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచివి. డయాబెటిస్ ను తగ్గించడంలో బాగా పనిచేస్తుందని తెలుసు. దీంతోపాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
undefined
సహజసిద్ధమైన ప్రకృతి సుగుణాలు మెంతుల్లో పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. ఇవి ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడం ద్వారా చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
undefined
రెగ్యులర్ టీ లేదా కాఫీని ఈ ఆరోగ్యకరమైన మేథి టీతో రీప్లేస్ చేయడం వల్ల ఊబకాయాన్ని తగ్గించొచ్చు, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించొచ్చు. మెంతుల్లోని సహజ యాంటాసిడ్ లక్షణాలు జీవక్రియ రేటును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
undefined
మెంతుల టీతో ఏం జరుగుతుంది? అంటే... రెగ్యులర్ టీని మెంతుల చాయ్ తో రీప్లేస్ చేయడం వల్ల మీ జీవక్రియ రేటు పెరుగుతుంది. బరువు తగ్గడానికి మరింత సహాయపడుతుంది. మెంతుల చాయ్ తో ఉదరసంబంధ వ్యాధులైన గుండెల్లో మంట, అసిడిటి, మలబద్ధకం వంటి వాటిని కూడా పరిష్కరిస్తుంది.
undefined
మెంతుల్లో యాంటాసిడ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాసిడ్ రిఫ్లక్స్ తగ్గించడంలో సహాయపడతాయి. కడుపులో వచ్చే అల్సర్లను తగ్గిస్తాయి.
undefined
మెంతుల్లోని ఫైబర్ మలబద్దకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెంతుల టీ తాగడం వల్ల మూత్రపిండాలకు ఆక్సిజనేటెడ్ రక్తాన్ని సరఫరా చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్ల సమస్య రాకుండా ఉంటుంది.
undefined
మెంతుల చాయ్ ని ఎలా తయారు చేసుకోవాలి.. అంటే.. మెంతులు దంచడం, లేదా మిక్సీ లో ఒక్కసారి తిప్పడం వల్ల ఇవి రవ్వలా మారతాయి.
undefined
గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ మెంతుల పొడి వేసి బాగా కలిపి.. వడకట్టాలి. తరువాత దీనికి ఒక టీస్పూన్ తేనె కలిపి తాగడమే.
undefined
లేదంటే రాత్రిపూట మెంతుల్ని నానబెట్టి, ఉదయాన్నే ఈ నీటిలో తులసి ఆకులు వేసి మరిగించి, వడకట్టి ఒక టీస్పూన్ తేనె కలిపి తాగొచ్చు.
undefined
click me!