వాడిన మాస్క్ నే మళ్లీ వాడుతున్నారా? ఎంత హాని చేస్తుందో తెలుసా???

First Published Aug 12, 2021, 3:52 PM IST

కోవిడ్ 19 రకరకాలుగా రూపాంతరం చెందుతూ, ఫస్ట్, సెకండ్ వేవ్ లతో పాటు ఇప్పుడు డెల్టా వేరియంట్ గా థార్డ్ వేవ్ తో భయపెట్టబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మాస్క్ పెట్టుకోవడాన్ని మరిచిపోవద్దని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అలసత్వం పాటించినా కరోనా బారిన పడి ప్రాణాపాయంలో పడడం ఖాయం అని.. మాస్కును సీరియస్ గా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

కోవిడ్ 19 మనజీవితాల్లో చాలా మార్పు తీసుకువచ్చింది. సామాజిక దూరం, మొహానికి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవడం నిత్య జీవితంలో తప్పనిసరి భాగంగా మార్చేసింది. దీంతో ఎవ్వరు చూసినా మొహానికి మాస్కుతో తప్ప మామూలుగా కనిపించే పరిస్తితి లేదు. మాస్కు లేకుండా కనిపిస్తే జనాలు భయపడే పరిస్థితులు కూడా ఉన్నాయి. మాస్క్ పెట్టుకోలేదని జరిగే గొడవలు, పెట్టుకోమన్నందుకు దాడులు లాంటి క్రైం కూడా చాలాసార్లు వార్తల్లో కనిపిస్తుందే. 

కోవిడ్ 19 రకరకాలుగా రూపాంతరం చెందుతూ, ఫస్ట్, సెకండ్ వేవ్ లతో పాటు ఇప్పుడు డెల్టా వేరియంట్ గా థార్డ్ వేవ్ తో భయపెట్టబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మాస్క్ పెట్టుకోవడాన్ని మరిచిపోవద్దని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అలసత్వం పాటించినా కరోనా బారిన పడి ప్రాణాపాయంలో పడడం ఖాయం అని.. మాస్కును సీరియస్ గా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచనల ప్రకారం.. కరోనావైరస్ ను అరికట్టే చర్యల్లో మొదటిది మాస్క్. మొహానికి మాస్క్ పెట్టుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని ప్రభావవంతంగా అరికట్టవచ్చు. వైరస్ నియంత్రణలో మాస్క్ అనేది తాత్కలిక ప్రత్యామ్నాయమే నని కూడా చెబుతున్నారు. అయితే అన్నింటికంటే ముందు వరుసలో చేయాల్సిన పని మాస్కును ధరించడమే. 

వ్యాక్సినేషన్ జోరందుకున్న క్రమంలో మాస్క్ విషయంలో అజాగ్రత్త పెరిగిపోతోంది. రెండు డోసులు పూర్తైన వారు ఇక తమకు ఏమీ కాదన్న ధీమాతో మాస్కులు పెట్టుకోవడం మానేస్తున్నారు. అయితే ఇది ఎంత మాత్ర సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల వైరస్ సోకకుండా ఉండదని.. కాకపోతే ప్రభావం తక్కువగా ఉంటుందని.. కాబట్టి వ్యాక్సినేషన్ పూర్తయినా మాస్క్ తప్పనిసరి అని చెబుతున్నారు. 

కోవిడ్ మహమ్మారి ప్రారంభంలో యూజ్ అండ్ థ్రో మాస్కులు వాడేవారు. వీటిని ఒక్కసారి వాడి పడేసేవారు. కానీ ఈ మహమ్మారి సంవత్సరాల తరబడి సాగుతుండడంతో ప్రత్యామ్నాయంగా రీయూజ్ చేసే N 95మాస్కులు, క్లాత్ మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిల్లో కొన్ని వాషబుల్ కూడా.. కాగా రెగ్యులర్ గా వాడుతున్నవాళ్లు చాలాసార్లు వీటిని అంతే రెగ్యులర్ గా ఉతకడం లేదా శానిటైజ్ చేయడం చేయట్లేదు. దీనివల్ల మాస్క్ వాడడం వల్ల కలిగే మంచి కంటే చెడు ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. 

గంటల తరబడి మాస్క్ పెట్టుకుని ఉండడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. చాలామంది మొహం మీద దద్దుర్లు, మొటిమలు, మంట లాంటివి కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ ప్రభావం అందర్లో ఒకేలాగా ఉండదు. మనుషుల్ని బట్టి మారుతూ ఉంటుంది. స్కిన్ టైప్ ని బట్టి కూడా ప్రభావం ఉంటుంది. 

వీటిల్లో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మస్కెన్. అంటే చర్మం మీద వచ్చే మొటిమలు. దీనివల్ల మొహం మీద ఎరుపుదనం, దురద ఉంటాయి. కారణం ఏంటంటే గంటలతరబడి మాస్క్ పెట్టుకోవడం వల్ల మొహం మీద చెమటలు పట్టడం, తద్వారా చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల మొటిమలు రావడానికి కారణమవుతాయి. 

ఇక ఇలా మాస్క్ ను ఉతకకుండా వాడుతుండడం వల్ల ఇన్ ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది. గంటలతరబడి అదే మాస్కును వేసుకోవాల్సి రావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. వైరస్ నుండి మీ మాస్క్ మిమ్మల్ని రక్షిస్తుంది. కరెక్టే.. కానీ మాస్కుకు అంటుకున్న వైరస్ మీరు దాన్ని శుభ్రం చేయకపోవడం వల్ల అందులోనే ఉండి మీకు ఎఫెక్ట్ ఇచ్చే ప్రమాదం కూడా ఉంది. 

అపరిశుభ్రమైన, పదే పదే ఒకే మాస్క్ ను వాడడం వల్ల బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ్యూకోర్మైసిస్ ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. అందుకే సర్జికల్ మాస్క్ లు బెస్ట్ అంటున్నారు నిపుణులు.. యూజ్ అండ్ త్రో చేయగల ఇలాంటి మాస్కుల వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మీ స్కిన్ సెన్సిటివ్ అయితే కాటన్ మాస్కులు వాడొచ్చని.. కాకపోతే వాడిన ప్రతిసారీ పిండాలని చెబుతున్నారు. 

click me!