శివ మూవీలో మోహన్ బాబా? వద్దంటే వద్దన్న వర్మ... కారణం ఏమిటో తెలుసా?

First Published May 7, 2024, 12:17 PM IST


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా ఉంది. ఈ మూవీలో ఓ పాత్ర కోసం మోహన్ బాబును నిర్మాత సూచించగా... వర్మ ససేమిరా అన్నాడట. అందుకు కారణం ఏమిటో చూద్దాం.. 
 


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెబ్యూ మూవీ శివ. నాగార్జున-అమల జంటగా తెరకెక్కింది. విజయవాడలో పుట్టి పెరిగిన వర్మ... తాను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా శివ కథ రాసుకున్నాడు. పొలిటికల్ ఆధిపత్యం కోసం కొందరు రాజకీయ నాయకులు రౌడీలను, గుండాలను ఎలా పెంచి పోషిస్తారో చక్కగా చెప్పాడు. 
 

Shiva Movie

1989లో విడుదలైన శివ బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసింది. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టేకింగ్ చాలా కొత్తగా తోచింది. ఇక సైకిల్ చైన్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 
 

Shiva Movie

రఘువరన్, తనికెళ్ళ భరణి, జేడీ చక్రవర్తి, శుభలేఖ సుధాకర్, మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు కీలక రోల్స్ చేశారు. కాగా రఘువరన్ ప్రధాన విలన్ రోల్ చేశాడు. ఇతని ప్రధాన అనుచరుడు గణేష్ అనే కరుడుగట్టిన రౌడీ పాత్రను విశ్వనాథ్ అనే నటుడు చేశాడు. 
 

Shiva Movie

ఈ పాత్రకు మోహన్ బాబును తీసుకుందామని శివ చిత్రం నిర్మాత అయిన అక్కినేని వెంకట్ సూచించారట. మోహన్ బాబుతో నాకున్న పరిచయంతో ఆయన్ని ఒప్పిస్తానని అక్కినేని వెంకట్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అన్నారట. అయితే వర్మ అందుకు ఒప్పుకోలేదట. 
 

మోహన్ బాబు తెలుగు ప్రేక్షకులు బాగా తెలిసిన విలక్షణ నటుడు. మోహన్ బాబును ఆడియన్స్ ఒక కరుడుగట్టిన విలన్ గా ఊహించుకోలేరు. ఆయన ఆ పాత్ర చేస్తే... మోహన్ బాబు మాత్రమే కనిపిస్తాడు. అందుకే మోహన్ బాబుతో గణేష్ పాత్ర చేయించడం సరికాదని అన్నారట. 
 

Shiva Movie

పెద్దగా పరిచయం, ఫేమ్ లేని విశ్వనాథ్ అనే నటుడు గణేష్ రోల్ చేశాడు. శివ సినిమా సక్సెస్ కి మరో కారణం... రోల్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. వర్మ అంత గొప్పగా సన్నివేశాలు, పాత్రలు రాసుకున్నారు. శివ సినిమాకు డైలాగ్స్ తనికెళ్ళ భరణి రాయడం విశేషం. అమల గ్లామర్, ఇళయరాజా సాంగ్స్ ప్లస్ అయ్యాయి...

click me!