కాజల్‌ ప్రస్తావన తెచ్చి ప్రభాస్‌ని స్టేజ్‌పై ఆటపట్టించిన అల్లు అర్జున్‌.. దెబ్బకి డార్లింగ్‌ ఏం చేశాడంటే?

Published : May 07, 2024, 12:45 PM ISTUpdated : May 07, 2024, 02:27 PM IST

అల్లు అర్జున్‌ చలాకీగా, కొంటెగా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. ఎవరినైనా ఆటపట్టించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అయితే ఏకంగా ప్రభాస్‌ని ఈవెంట్‌లో ఆటపట్టించడం విశేషం.   

PREV
18
కాజల్‌ ప్రస్తావన తెచ్చి ప్రభాస్‌ని స్టేజ్‌పై ఆటపట్టించిన అల్లు అర్జున్‌..  దెబ్బకి డార్లింగ్‌ ఏం చేశాడంటే?

కెరీర్‌ ప్రారంభంలో అల్లు అర్జున్‌, ప్రభాస్‌ ఎంతో క్లోజ్‌గా, ఫ్రెండ్లీగా ఉండేవారు. మొదట ప్రభాస్‌ కెరీర్‌ ప్రారంభించినా, బన్నీతో మంచి అనుబంధం ఉంది. దీంతో `ఆర్య2` ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా ప్రభాస్‌. ఇందులో ఈ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్‌ రచ్చ రచ్చ అయ్యింది. ప్రభాస్‌ మాట్లాడుతుండగా, బన్నీ చేసిన పని అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. అంతేకాదు డార్లింగ్‌ స్పీచ్‌ ఆపేసి వెళ్లాల్సి వచ్చింది. 
 

28

అల్లు అర్జున్‌.. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ కొడుకు, లెజెండరీ కమెడియన్‌ అల్లు రామలింగయ్య మనవడు అనే విషయం తెలిసిందే. దీంతో కె రాఘవేంద్రరావు సారథ్యంలో అల్లు అర్జున్‌ సినిమా ఎంట్రీ జరిగింది. `గంగోత్రి`తో బన్నీ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త దర్శకుడికి లైఫ్‌ ఇచ్చారు. సుకుమార్‌ అనే కొత్త దర్శకుడితో యూత్‌ఫుల్‌ రొమాంటిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌ `ఆర్య` చిత్రంలో నటించారు బన్నీ. దిల్‌ రాజు నిర్మించారు. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో కొంత గ్యాప్‌ తర్వాత దీనికి సీక్వెల్‌గా `ఆర్య 2` చేశారు. ఇందులో కాజల్‌ హీరోయిన్‌. 
 

38

`ఆర్య2` రిలీజ్‌కి ముందు ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో స్టార్‌ డైరెక్టర్లు, నిర్మాతలు పాల్గొన్నారు. ఇందులో సుకుమార్‌తోపాటు రాజమౌళి, వినాయక్‌ వంటి వారు పాల్గొన్నారు. అలాగే గెస్ట్ గా ప్రభాస్‌ వచ్చాడు.
 

48

చివర్లో డార్లింగ్‌ మాట్లాడుతూ, నాకు బన్నీ అంటే చాలా చాలా ఇష్టం. `ఆర్య` ఆడియో ఫంక్షన్‌ కి వచ్చాను, ఆ సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అవబోతుందని చెప్పాను. పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు `ఆర్య2` దానికి మించిన బ్లాక్‌ బస్టర్‌ మాత్రమే కాదు, ఇంకా ఏదో కాబోతుందనిపిస్తుంది. 

58

బన్నీకిది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను. సుకుమార్‌ సూపర్బ్ డైరెక్టర్‌, దేవి నాకు కెరీర్‌లో బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. కానీ బన్నీకి మాత్రం నాకంటే బెటర్‌గా ఇచ్చినా ఫర్వాలేదన్నారు ఆ తర్వాత కాజల్‌ గురించి చెప్పాడు ప్రభాస్‌. `కాజల్‌తో నేను ఇప్పుడే పనిచేశాను` అని చెప్పగానే, మైక్‌ తీసుకున్న బన్నీ `కాజల్‌ని మర్చిపోతారా` అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు. 
 

68

అన్నీ అబద్దాలే అంటూ చెప్పిన ప్రభాస్‌..కాజల్‌ వెరీ హార్డ్ వర్కర్, సూపర్బ్ పర్‌ఫెర్మర్‌, మొన్న ఇరవై రోజు స్విట్జర్లాండ్‌లో పనిచేశామని తెలిపారు డార్లింగ్‌. వెరీ గుడ్‌ అని ప్రభాస్‌ చెప్పగానే ఓ వైపు పక్కన ఉన్న బన్నీ, మరోవైపు వేదికపై ఉన్న వాళ్లు, ఇక ఫ్యాన్స్ మరోసారి అరుపులతో హోరెత్తించారు. కంటిన్యూగా అరుస్తుండటంతో తట్టుకోలేకపోయాడు. అరే వర్క్ చేశామని చెప్పినా వినలేదు, అరుస్తూనే ఉన్నారు. ఓకే సూపర్బ్ ఆర్య 2 పెద్ద హిట్‌ కావాలని వెంటనే స్పీచ్‌ ఆపేసి వెళ్లిపోయాడు ప్రభాస్.
 

78

అంతగా అందరి ముందు డార్లింగ్‌ని ఆటపట్టించాడు బన్నీ. ఆ దెబ్బకి మామూలుగా లేదు. ప్రభాస్ అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి రావడం గమనార్హం. అయితే ఇదంతా జస్ట్ ఫన్నీ వేలో కావడం విశేషం. కానీ బన్నీ కొంటె పని కారణంగా పాపం ప్రభాస్‌కి ఇబ్బంది పడటం గమనార్హం. నేడు `ఆర్య` సినిమా వచ్చిన ఇరవై ఏళ్లు. ఈ సందర్భంగా ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. దీన్ని బన్నీ ఫ్యాన్స్, డార్లింగ్‌ ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

88

 ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ పాన్‌ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. ప్రభాస్ ఇప్పటికే గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. `కల్కి2898ఏడీ` ప్రపంచ మార్కెట్‌పై దండయాత్ర చేయబోతున్నారు. ఇది జూన్‌ 27న రిలీజ్‌ కాబోతుంది. భారీ సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు బన్నీ ఇప్పుడు `పుష్ప2` చిత్రంలో నటిస్తున్నారు.దీనికి సుకుమార్‌ దర్శకుడు కావడం విశేషం. ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్‌ కాబోతుంది. ఈ మూవీతో గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేశడు బన్నీ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories