క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి పరిచయం అవసరం లేదు. ఆయన కుమార్తె సారా టెండుల్కర్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా తన ఫిట్నెస్, అందంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.
యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ తో కొంతకాలం ప్రేమాయణం కూడా నడిపింది. అలా కూడా కొంతకాలం వార్తల్లో నిలిచింది. ఈ సంగతి పక్కన పెడితే... ఎప్పుడూ అందంగా, ఫిట్ గా కనిపించే సారా కూడా ఒక అనారోగ్య సమస్యతో చాలా కాలం బాధపడిందట.
అది మరేంటో కాదు... చాలా మంది మహిళలు ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్న సమస్య పీసీఓఎస్ (పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రమ్). దీనితో పాటు.. మొటిమల సమస్యతో కూడా బాధపడిందట. ఈ విషయాన్ని సారానే స్వయంగా వెల్లడించింది. వాటి కారణంగా తాను ఎదుర్కొన్న సవాళ్లను, ఇప్పుడు తన లైఫ్ ఎలా మారింది అనే విషయాన్ని ఆమె వివరించారు.
తనకు టీనేజీ వయసులో ఉన్న సమయంలోనే పీసీఓఎస్ సమస్య మొదలైందని సారా చెప్పింది, అప్పుడు తనకు ముఖం నిండా మొటిమలు ఉన్నాయని చెప్పింది. వాటిని తగ్గించుకోవడానికి తాను రెటినోల్ నుండి లేజర్‌ల వరకు చాలా విషయాలు ప్రయత్నించాను అని, ఫలితం రాలేదని చెప్పింది
అందుకే... తాను తన లైఫ్ స్టైల్ ని మార్చుకోవడానికి ప్రయత్నతించాను అని , బరువు తగ్గించుకోవడం మొదలుపెట్టాను అని, హార్మోన్ల అసమతులత్య తగ్గిన తర్వాత.. మొటిమల సమస్య కూడా తగ్గింది అని సారా వివరించింది.
ఇక సారా టెండూల్కర్ బయోమెడిసిన్ చదువుతున్నప్పుడు తాను మూడు సంవత్సరాలు సౌందర్య సాధనాల సంస్థలో పనిచేశారట. ఇప్పుడు మాత్రం.. సారా.. చూపు తిప్పుకోలేని అందంతో... మంచి ఫ్లా లెస్ స్కిన్ టోన్ కలిగి ఉంది.