ఐరన్ కడాయిలో వీటిని మాత్రం వండొద్దు..

First Published May 7, 2024, 12:48 PM IST

ఐరన్ కడాయిలో రకరకాల వంటలను చేస్తుంటారు. కానీ ఐరన్ కడాయిలో కొన్ని వంటలను అస్సలు వండకూడదు. ఒకవేళ వీటిని వండి తిన్నారంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. 
 

ఇనుప కడాయిలను వంట చేయడానికి బాగా ఉపయోగిస్తుంటారు మన దేశంలో. కానీ కొన్ని వంటలకు ఇనుప కడాయిలను ఉపయోగించకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును  కొన్ని వంటలకు ఇనుప కడాయిలు పనికి రావు. ఒకవేళ వీటిని మీరు తిన్నా ఎన్నో సమస్యల బారిన పడతారు. మరి ఇనుప కడాయిలో ఏమేమి వండి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఆకుకూరలు

బచ్చలికూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఆమ్లం ఇనుముతో ప్రతిస్పందిస్తుంది. అలాగే ఇది బచ్చలికూర రంగును మారుస్తుంది. అంతేకాకుండా బచ్చలికూరలోని పోషకాలన్నీ తొలగిపోతాయి. అందుకే బచ్చలికూరను ఇనుప కడాయిలో ఉడికించి తినకూడదు. 
 

బీటు రూట్ 

బీట్ రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఒంట్లో రక్తం పెరగడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని పచ్చిగా లేదా జ్యూస్ చేసుకుని లేదా కర్రీ చేసుకుని తింటుంటారు. అయితే బీట్ రూట్ ను ఐరన్ కడాయిలో అస్సలు వండి తినకూడదు. ఎందుకంటే దీనిలో ఐరన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి బీట్ రూట్ ను ఐరన్ కడాయిలో అస్సలు వండకండి. 

Tamarind


చింతపండు

ఇనుప పాన్లలో పులుపు వంటలను వండటం మానుకోండి. ముఖ్యంగా చింతపండును. ఎందుకంటే ఐరన్ కడాయిలో చింతపండును ఉడికించడం వల్ల ఆహారం రంగు పూర్తిగా చెడిపోతుంది. అంతేకాదు ఇది రుచిని కూడా పాడు చేస్తుంది.

నిమ్మకాయ 

నిమ్మకాయ రసాన్ని కూడా ఐరన్ కడాయిలో వేసి వండకూడదు. ఎందుకంటే ఇనుప కడాయిలో నిమ్మరసాన్ని వేసినప్పుడు అది చేదుగా మారుతుంది. దీంతో మీరు దీనిలో చేసిన వంటను అస్సలు తినలేరు.
 

టమాటాలు

టమాటాల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ టమాటాలను ఇనుప పాత్రలో వండటం వల్ల శరీరానికి హానికరమైన లోహ ప్రభావాలు ఏర్పడతాయి.

చేప

చేపలు వంటి సీ ఫుడ్స్  ఇనుప పాన్ కు అంటుకునే అవకాశం ఉంది. అందుకే ఇనుము కడాయిలో చేపలు వంటి ఆహారాలను అస్సలు వండకూడదు. పొలుసులు త్వరగా కాలిపోయే అవకాశం ఉన్నందున ఇనుప పాన్ దీనికి సరైది కాదు. 
 

click me!