పాలు, నీళ్లను ఇలా తాగితేనే మంచిది..? ఎలా పడితే అలా తాగారో..?

First Published Feb 6, 2023, 10:51 AM IST

పాలు, నీళ్లను ఎలా పడితే అలా తాగడానికి లేదు. మీకు తెలుసో? తెలియదో కానీ వీటిని తాగడానికి కూడా ఒక మార్గం అంటూ ఉంది. కొందరు నిలబడి తాగితే.. మరికొందరు కూర్చుని తాగుతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాలు, నీళ్లను ఎలా తాగాలంటే? 

drinking water

బయటకెళ్లిన వారు ముందుగా చేసే పని కాళ్లను కడుక్కుని నేరుగా వంటింట్లోకి వెళ్లి నీళ్లను తాగడం. నిజానికి నీళ్లు మన శరీరానికి చాలా చాలా అవసరం. నీళ్లతోనే  మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. నీళ్లను సరిగ్గా తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడి ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఈ సంగతి పక్కన పెడితే మనం నీళ్లను ఎలా తాగుతున్నామన్నది చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అవును నిలబడి తాగుతున్నామా? లేదా కూర్చుని నీళ్లను తాగుతున్నామా అనేది చాలా చాలా ముఖ్యం. ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే.. నీళ్లను తాగడానికి ఒక పద్దతి ఉంది. ఈ పద్దతిలోనే నీళ్లను తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు. ఇకపోతే పాలను కూడా నీళ్లలాగే తాగాలన్న నియమం లేదు. నీళ్లు, పాలు తాగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బయటి నుంచి వచ్చిన వెంటనే చల్లని నీళ్లను తాగొద్దని పెద్దలు చెప్తుంటారు. ఇంకా చాలా సందర్భాల్లో నీళ్లను తాగకూడదని చెప్తుంటారు. కానీ మనలో చాలా మంది ఈ సూచనలన్నింటినీ పెడచెవిన పెడతారు. దీనివల్లే లేనిపోని రోగాలొచ్చే ప్రమాదం ఉంది. ముందుగా నిలబడి నీళ్లను తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆర్థరైటిస్ ప్రమాదం 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిలబడినప్పుడు నీళ్లను తాగడం సర్వ సాధారణ విషయం. కానీ ఇలా నీళ్లను తాగితే ఆర్థరైటిస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి నిలబడి ఉన్నప్పుడు నీళ్లను తాగడం వల్ల శరీరం లోపల ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే కీళ్లలో ద్రవం ఎక్కువగా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది భవిష్యత్తులో ఆర్థరైటిస్ వ్యాధికి దారితీస్తుంది. 
 

జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది

నిలబడి నీళ్లు తాగడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది జీర్ణవ్యవస్థను మరింత బలహీనపరుస్తుంది. జీర్ణశయాంతర ప్రేగులను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా నిలబడి నీళ్లను తాగడం వల్ల దాహం ఎంతకీ తీరదు.
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు కూర్చుని నీళ్లను తాగితే మీ కండరాలు, నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతాయి. ఇది ద్రవాలు, ఇతర ఆహారాలను త్వరగా జీర్ణం చేయడానికి నాడీని ప్రేరేపిస్తుంది.
 

అల్సర్లు, గుండెల్లో మంట

మీరు నిలబడి నీళ్లను తాగినప్పుడు.. ఈ నీరు అన్నవాహిక దిగువ భాగంపై ప్రభావం చూపుతుంది. ఇది కడుపు, అన్నవాహిక మధ్య ఉమ్మడి స్పింక్టర్ ను ప్రభావితం చేస్తుంది. ఇది కడుపులో చికాకు కలిగిస్తుంది.
 

మూత్రపిండాల వ్యాధులు

మన శరీరంలోని నీటిని శుభ్రపరచడానికి మూత్రపిండాలు ఉపయోగపడతాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాలు ఈ నీటిని సరిగ్గా శుభ్రం చేయవు. దీనివల్ల నీరు పూర్తిగా శుద్ధి కాక మూత్రపిండాల్లో మురికి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది మూత్ర విసర్జన చేసేటప్పుడు చికాకు, నొప్పిని కలిగిస్తుంది.


పాలను నిలబడి తాగాలి

ఆయుర్వేదం ప్రకారం.. పాలను నిలబడే తాగాలి. దీనివల్ల పాలు సులభంగా జీర్ణమవుతాయి. నిజానికి పాలు తాగడం వల్ల దాని ప్రభావం జీర్ణవ్యవస్థపై కనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. వాత,  పిత్త దోషాన్ని నియంత్రించడానికి పాలు పనిచేస్తాయి. లేచి నిలబడి గోరువెచ్చని పాలు తాగితే అది శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 

నిలబడి ఉన్నప్పుడు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

నిపుణుల ప్రకారం.. పాలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది.

అంతేకాదు ఆస్టియో ఆర్థరైటిస్ రాకుండా మనల్ని కాపాడుతాయి. 

ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం.

పాలలో ఉండే విటమిన్ డి అసహజ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది.

click me!