రవితేజ.. `సింధూరం` సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. `అల్లరి ప్రియుడు`, `నిన్నే పెళ్లాడతా`, `మనసిచ్చి చూడు`, `సీతారామరాజు`, `ప్రేమకు వేళాయరా` వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. 1999లో `నీకోసం` చిత్రంతో హీరోగా మారారు. ఈ మూవీతో శ్రీనువైట్ల దర్శకుడిగా మారాడు. ఈ సినిమా హిట్ కావడంతో ఇక రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇటీవల `ఈగల్`తో ఆకట్టుకున్న రవితేజ ఇప్పుడు `మిస్టర్ బచ్చన్`లో నటిస్తున్నారు.