ఎనిమిది కోట్లతో భారీ ఫైట్‌ సీక్వెన్స్.. `తమ్ముడు` కోసం నితిన్‌ సాహసం..

By Aithagoni RajuFirst Published Apr 24, 2024, 6:16 PM IST
Highlights

నితిన్‌ హీరోగా ప్రస్తుతం `తమ్ముడు` చిత్రంతో రూపొందుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి గురించి ఓ గూస్‌ బంమ్స్ తెప్పించే అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. 
 

నితిన్‌ని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. గతంలో మాదిరిగా బ్యాక్ టూ బ్యాక్‌ ఫ్లాప్‌లను చవిచూస్తున్నాడు నితిన్‌. ఒక్క హిట్‌ కోసం ఆయన ఏళ్లతరబడి పోరాడాల్సి వస్తుంది. ఎన్నో ఆశలు, అంచనాలతో వచ్చిన `ఎక్స్ టార్డినరీ మ్యాన్‌` డిజాస్టర్‌ అయ్యింది. దీంతో ఇప్పుడు నితిన్‌ ఆశలన్నీ `రాబిన్‌హుడ్‌`, `తమ్ముడు` చిత్రాలపైనే పెట్టుకున్నారు. `రాబిన్‌హుడ్‌` వెంకీకుడుముల దర్శకత్వంలో రూపొందుతుంది. దీంతోపాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో `తమ్ముడు` చిత్రం తెరకెక్కుతుంది. దిల్‌ రాజు ఈ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

ఇటీవల నితిన్‌ బర్త్ డే సందర్భంగా `తమ్ముడు` ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ లుక్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బస్సుపై ప్రయాణిస్తున్నట్టుగా ఈ లుక్‌ ఉంది. నితిన్‌ చేతిలో సుబ్రమణ్య స్వామి ఆయుధం ఉంది. బస్సుని లేడీ డ్రైవ్‌ చేస్తుండటం విశేషం. సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించేలా ఈ పోస్టర్‌ ఉంది. శరవేగంగా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా సినిమాకి సంబంధించిన గూస్‌బంమ్స్ తెప్పించే షూటింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. 

ప్రస్తుతం ఈ మూవీ ఆర్‌ఎఫ్‌సీలో చిత్రీకరణ జరుగుతుందట. నితిన్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారట. నేటి నుంచే ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇందులో ఏకంగా యాభై మంది ఫైటర్లు పాల్గొంటున్నారని, ఈ ఫైట్‌ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది. దాదాపు పది రోజులపాటు ఈ షెడ్యూల్‌ ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ ఫైట్‌ సీక్వెన్స్ బడ్జెట్‌ వింటే మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే. 

దీనికోసం మేకర్స్ ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఆ రేంజ్‌లో ఈ యాక్షన్‌ సీన్లు తీస్తున్నారని టాక్‌. `తమ్ముడు` సినిమా మొత్తంలోనే ఇది హైలైట్‌గా ఉంటుందని, నితిన్‌ కెరీర్ లోనే ది బెస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. నితిన్‌పై కేవలం యాక్షన్‌ సీక్వెన్స్ కి ఈ రేంజ్‌లో అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ఈ ఫైట్‌ ఎలా ఉంటుందని, ఏం రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీకి `కాంతార` ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇందులో నితిన్‌కి ఇద్దరు హీరోయిన్లుంటారని, ఓ హీరోయిన్‌గా `కాంతార` ఫేమ్‌ సప్తమి గౌడ, మరో హీరోయిన్‌గా వర్ష బొల్లమ్మ ఫైనల్‌ అయినట్టు టాక్‌. అలాగే సీనియర్‌ నటి లయ కీలకపాత్రలో నటిస్తుంది. 
 

click me!